దామెర: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ, పులుకుర్తి సబ్ సెంటర్, ఊరుగొండ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, మందుల స్టాకు వివరాలు పరిశీలించడంతో పాటు సాధారణ టీకాల, ఓపీ వివరాలపై ఆరాతీశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను వెబ్సైట్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగే విధంగా సిబ్బంది కృషిచేయాలని సూచించారు. ఊరుగొండకు చెందిన కీసరి చందన ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవమై 2.75 కిలోల మగ శిశువుకు జన్మనిచ్చింది. చందనను బ్రాండ్ అంబాసిడర్గా గుర్తించినట్లు ప్రకటించి సన్మానించారు. ఆయన వెంట మెడికల్ ఆఫీసర్ మహేంద్ర, డాక్టర్ వనజ, సిబ్బంది తదితరులు ఉన్నారు.
డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య


