ఎల్కతుర్తి: ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్‌ఎమ్‌ఆర్ గార్డెన్‌లో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచితంగా సహాయక ఉపకరణాలు అందించేందుకు ఏర్పాటు చేసిన నిర్థారణ వైద్య శిబిరాన్ని మంగళవారం ఆయన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 18వ తేదీన భీమదేవరపల్లి మండలంలో వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కృత్రిమ కాళ్లు, చేతులు, వినికిడి యంత్రాలు, చంక కర్రలు, వీల్‌చైర్లు, మూడు చక్రాల వాహనాలు తదితర సహాయక ఉపకరణా లను ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు.
మార్కెట్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రూ.1.02 కోట్ల వ్యయంతో నూతన మార్కెట్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ శంకుస్థానప చేశారు. ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో కోతుల బెడద ఉందని, సోలార్ పెన్సింగ్ ఏర్పాటు చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కోరగా.. సోలార్ పెన్సింగ్ ఏర్పాటుకు కృషి చేస్తాని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, అలింకో సంస్థ ప్రతినిధులు, ఎంపీడీఓ విజయ్‌కుమార్, వ్యసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినె సంతాజీ, మార్కెట్ వైస్ చైర్మన్ స్రవంతి, సర్పంచ్ లావణ్య, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్, సింగిల్ విండో చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ముప్పు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ
మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను మంగళవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత వైద్య శిబిరం


