భీమదేవరపల్లి: మండలంలోని వంగర గ్రామంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. కేంద్రంలోని ఫొటోగ్యాలరీ, మ్యూజియం, కాన్ఫరెన్స్ హాల్‌తో పాటు ప్రాంగణంలో నాటిన మొక్కలు, పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక సర్పంచ్ సృజన, కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం, ఏపీఓ కుమారస్వామి, డీఈలు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
డిసెంబర్‌లో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు


