పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
కాజీపేట: వైఎస్‌ఆర్ నగర్ భూముల వాస్తవ పరిస్థితి వెలుగు చూసే వరకు ఆ స్థలంలో 144 సెక్షన్ విధించి పేదలకు న్యాయం జరిగే దాకా విశ్రమించేది లేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజీపేటలో మంగళవారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే కొంతమంది వైఎస్‌ఆర్ నగర్ కాలనీ భూముల విషయంలో చిల్లర రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోని ఓ నాయకుడు.. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మె ల్యే, బీజేపీ నాయకులతో కలిసి కపట నాటకాలకు తెరలేపారని, అతి త్వరలో వారి జాతకాలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతామన్నారు. కాజీపేట చౌరస్తాలోని త్రిబుల్‌ఎస్ కాంప్లెక్స్ నిర్మాణానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన భవన అనుమతులను పత్రికలకు విడుదల చేశారు. వైఎస్‌ఆర్ నగర్ కాలనీవాసుల జోలికి బయటి వ్య క్తులు వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు జక్కుల రవీందర్‌యాదవ్, విజ యశ్రీ రజాలీ తదితరులున్నారు.


