ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

కాళోజీ సెంటర్‌: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల్లోనూ అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని, వారిలోని నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మంగళవారం ఖిలా వరంగల్‌ మండలం శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ విద్యార్థికి ప్రభుత్వ పథకాలు, విద్యా సదుపాయాలు, అవసరమైన సహా య సహకారాలు అందేలా అధికారులు, ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయాలన్నారు. విద్యార్థుల్లోని వివిధ రకాల వైకల్యాలను గుర్తించేందుకు అ న్ని యాజమాన్యాల పాఠశాలల్లో ప్రశస్త్‌ యాప్‌ ద్వా రా స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నామని, అర్హులైన విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన ప్రత్యేక విద్యా సేవలు అందించాలన్నారు. జిల్లా సమ్మిళిత విద్యా సమన్వయకర్త డాక్టర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడటంతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల, పరస్పర సహకారాన్ని పెంపొందిస్తాయన్నారు. మొత్తం 12 రకాల క్రీడా పోటీల్లో 13 మండలాల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళికా సమన్వయకర్త విజయ్‌కుమార్‌, ఎంఈఓ వెంకటయ్య, పీఈటీ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు రఫీక్‌, ఐఈఆర్‌పీలు, ప్రత్యేక విద్యాబోఽ దకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

డీఈఓ ప్రశాంత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement