ఖానాపురం: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని అశోక్‌నగర్‌లో స్కూల్ కోసం కేటా యించిన స్థలాన్ని పరిశీలించారు. అటవీశాఖ ఆదీ నంలో స్థలం ఉందని కొద్దిరోజులుగా పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఎ మ్మెల్యే మాధవరెడ్డి మంగళవారం కలెక్టర్ సత్యశారద, డీఎఫ్‌ఓ నిఖితలతో కలిసి స్థలం హద్దులను పర్యవేక్షించారు. స్కూల్ నిర్మాణానికి కావాల్సిన పరిపాలన అనుమతుల్లో అటవీశాఖ, రెవెన్యూ అధి కారులు సమన్వయం చేసుకుంటూ నిర్మాణాలకు ఆటంకాలు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. స్థలానికి సంబంధించిన మ్యాప్‌లను తిలకించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 22 బ్లాక్‌లతో నిర్మాణం చేపట్టే స్కూల్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థలం వద్ద ఉన్న కట్టపై కాలినడకన తిరుగుతూ ఎమ్మెల్యే మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గణేష్, డీటీడీఓ నారాయణరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, డీఈ అశోక్, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ అద్వైత, ఎఫ్‌ఆర్వో నరేష్, హరిబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి


