యాసంగిలో వరి సాగు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

యాసంగిలో వరి సాగు తగ్గించాలి

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

పర్వతగిరి: ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగిలో వరి సాగును తగ్గించాలని జిల్లా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌ విజయనిర్మల సూచించారు. ఈ మేరకు మండలంలోని ఏనుగల్లు, దుబ్బతండా గ్రామాల్లో వర్ధన్నపేట డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకుడు (ఏడీఏ) నర్సింగంతో మంగళవారం క్షేత్ర పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి పంట సాగును తగ్గించి ఆరుతడి పంటలవైపు రైతులు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శశికాంత్‌, సత్యప్రకాష్‌, రవికుమార్‌, సర్పంచ్‌ తిరుపతి, రైతులు పాల్గొన్నారు.

ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌ విజయనిర్మల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement