అర్హులందరికీ పింఛన్లు మంజూరు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ పింఛన్లు మంజూరు

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

● మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ

కాశిబుగ్గ: అర్హులందరికీ పింఛన్లు మంజూరవుతా యని, రానివారికి అధికారులు రీ సర్వే చేసి మంజూరు చేస్తారని మాజీ మంత్రి, వరంగల్‌ ఈస్ట్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. మంగళవారం వరంగల్‌ ఎల్‌బీ నగర్‌లో ఏర్పాటు చేసిన లబ్ధిదారులకు చేయూత పింఛన్‌ ధ్రువపత్రాల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మీసాల ప్రకాశ్‌, కలెక్టర్‌ సత్యశారద, బల్దియా కమిషనర్‌ వెంకన్న పాల్గొని అర్హులకు పింఛన్‌ మంజూరు పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా కొండా సురేఖ మాట్లాడారు. తూర్పులో 2,740 మందికి ప్రభుత్వం కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వైవీ.గణేశ్‌, అదనపు ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ సమ్మయ్య, డిప్యూటీ కమిషనర్‌ ప్రసన్నరాణి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement