‘మూడు’తిప్పలు | - | Sakshi
Sakshi News home page

‘మూడు’తిప్పలు

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

ఎల్‌ఆర్‌ఎస్‌కు.. ‘మూడు’తిప్పలు

25 శాతం రాయితీ ఆవిరి!

ఎల్‌ఆర్‌ఎస్‌కు..

చుక్కలు చూపెడుతున్న ఇరిగేషన్‌, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌ విభాగాలు

సాక్షి, వరంగల్‌: అక్కడ చెరువు, నాలా, కుంటలు దగ్గర ఉండవు కానీ ఇరిగేషన్‌ ఎన్‌ఓసీ అవసరం. ఆ ప్లాట్‌ వివాదంలో ఉండదు కానీ...నిషేధిత జాబితాలో ఉండేసరికి రెవెన్యూ ఎన్‌ఓసీ తప్పనిసరి...అక్కడా మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లలో ప్లాట్లు ప్రభావితం కావు.. అయినా బల్దియా టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల సైట్‌ విజిట్‌ అవసరం... ఇలా గ్రేటర్‌ వరంగల్‌లోని మూడు విభాగాధికారులు ‘బై టెక్నికల్‌ డిఫాల్ట్‌’గా వచ్చి చేరిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు చుక్కలు చూపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. సుమారు 7 వేలకు పైగా ఉన్న ఈ ప్రొహిబిటెడ్‌ దరఖాస్తుల విషయంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆన్‌లైన్‌లో క్లియర్‌ చేయాల్సి ఉన్నా.. పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మ్యాప్‌ల తప్పిదం.. వసూళ్లకు అస్త్రం!

నీటిపారుదల శాఖ అధికారుల వద్ద ఉన్న జలాశయాల మ్యాప్‌లను మాస్టర్‌ ప్లాన్‌లో సరిగ్గా అనుసంధానం చేయకపోవడం అధికారుల చేతివాటానికి వేదికై ందన్న విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్లాటుకు కిలోమీటర్ల మేర దూరంలో చెరువు ఉన్నా, పోర్టల్‌లో ఇరిగేషన్‌ ఎన్‌ఓసీ షార్ట్‌ఫాల్‌ కనిపిస్తోంది. ఇది క్లియర్‌ కావాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన దుస్థితి. ఒకవేళ బఫర్‌ జోన్‌కు కాస్త దగ్గర్లో ప్లాట్‌ ఉంటే ఇక రూ.లక్షల్లోనే బేరసారాలు నడుస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులు కూడా సైట్‌ విజిట్‌కు వచ్చి తమ ఫోన్‌లో కెడాస్ట్రాల్‌ మ్యాప్‌ ద్వారా జియో కో–ఆర్డినేట్స్‌ ద్వారా కొలతలు తీసుకుని అది ఏ సర్వే నంబర్లో ఉందో చెక్‌ చేసి క్లియర్‌గా ఉంటే ఎన్‌ఓసీని ఆన్‌లైన్‌లోనే క్లియర్‌ చేయాలి. ఇందుకోసం రూ.వేల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సైట్‌ విజిట్‌ కోసం రెవెన్యూ, ఇరిగేషనన్‌, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల అధికారులకు కలిపి కనీసం రూ.15 వేలు సమర్పించుకుంటే తప్ప ఫైలు కదలట్లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి విషయాల్లో దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేసి, సరైన మార్గదర్శనం చేసేందుకు మున్సిపల్‌ కార్యాలయంలో కనీసం ఒక ‘హెల్ప్‌ డెస్క్‌’ ఏర్పాటు చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

గ్రేటర్‌ వరంగల్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు ఇలా..

బై టెక్నికల్‌ డిఫాల్ట్‌ పేరుతో

దరఖాస్తుదారులకు కొర్రీలు

ఈనెలాఖరుతో ముగియనున్న

25 శాతం రాయితీ

హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు

చేయాలంటున్న దరఖాస్తుదారులు

‘ఎన్‌ఓసీలు రాకపోతే మీ ప్లాటు మీకు దక్కడం కష్టం’ అంటూ అధికారులు, దళారులు పరోక్షంగా భయపెడుతుండడంతో, గత్యంతరం లేని స్థితిలో కొందరు అడిగినంత సమర్పించుకుంటున్నారు. మరోవైపు, ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుపై 25 శాతం రాయితీ గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తోంది. అధికారుల జాప్యం కారణంగా వేలాది ఫైళ్లు పెండింగ్‌లోనే ఉండిపోవడంతో, సామాన్యులు 25 శాతం రాయితీ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో పాటు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement