జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు రుత్విక్‌ | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు రుత్విక్‌

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

ఉపాధి అవకాశాలు

దుగ్గొండి: మండలంలోని నాచినపల్లి గ్రామానికి చెందిన ముస్కుల రుత్విక్‌రెడ్డి జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికై నట్లు కోచ్‌ తిరుపతికిరణ్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ముస్కుల కిరణ్‌, సమత దంపతుల కుమారుడు రుత్విక్‌ ఇటీవల హైదరాబాద్‌ నాచారంలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో సింగిల్స్‌ విభాగంలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికయ్యారన్నారు. ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు మహారాష్ట్రలో జరగనున్న జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో రాష్ట్రం తరఫున ఆడనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.రాంరెడ్డి, సర్పంచ్‌ పెండ్యాల రాజు తదితరులు రిత్విక్‌ను అభినందించి జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు.

ఆన్‌ జాబ్‌ శిక్షణతో

కాళోజీ సెంటర్‌: ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సుల ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ (ఓజేటీ)తో ఉపాధికి అవకాశాలు మెరుగవుతాయని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ అన్నారు. మంగళవారం హనుమకొండలోని రోహిణి ఆస్పత్రిలో ఆర్డీఎఫ్‌, పర్వతగిరి జూనియర్‌ కళాశాల విద్యార్థుల ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రిలోని ఓపీ వార్డు, క్రిటికల్‌ కేర్‌ వార్డు, ల్యాబ్స్‌, రిపోర్టింగ్‌ సెల్‌, ఐసీయూ తదితర విభాగాల్లో విద్యార్థుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐఈఓ శ్రీధర్‌ సుమన్‌ మాట్లాడుతూ ఇంటర్‌ బోర్డు ఆదేశాల మేరకు ఒకేషనల్‌ విద్యార్థులకు వృత్యంతర శిక్షణ తప్పనిసరి అని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నా రు. విద్యార్థుల హాజరు, వారి రోజువారీ నేర్చుకునే రికార్డులను పరిశీలించారు. అనంతరం ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని కాసం ఫ్యాషన్స్‌, నర్సంపేట కో–ఎడ్యుకేషన్‌ కళాశాల విద్యార్థుల శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ జనార్దన్‌, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన

వసతులు కల్పిస్తాం

నర్సంపేట: నర్సంపేట పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మిరామానంద్‌ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని మాధన్నపేట రోడ్డులో నూతనంగా నిర్మాణం చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్డు పనుల నిర్మాణాలు వేగవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మా ధవరెడ్డి నాయకత్వంలో నర్సంపేట పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎలకంటి విజయ్‌కుమార్‌, సలావుద్దీన్‌ అయూబ్‌ఖాన్‌, శ్రీరామోజు రోజారాణి, మున్సిపల్‌ సిబ్బంది బొల్లెపల్లి శ్రావణ్‌, ములుకల మనీష్‌, నాయకులు బొమ్మెరబోయిన ప్రేమ్‌కృష్ణ, మచ్చకంటి మనోజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారం

తయారు చేసుకోవాలి

నర్సంపేట: తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు గల ఆహారాన్ని తయారు చేసుకోవాలని కృషి విజ్ఞాన్‌ కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌, సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ అరుణ్‌జ్యోతి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని నర్సంపేట–4 అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు గల ఆహారం తయారు చేసుకోవడం సీడీపీఓ మధురిమ అధ్యక్షతన వంట చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని రకాల కూరగాయలతో కిచిడి తయారు చేసుకోవడంతో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాస్త్రవేత్త డాక్టర్‌ గణేష్‌, ఏసీడీపీఓ జ్యోతి, సూపర్‌వైజర్‌ అరుణ, హెచ్‌ఎం శోభ, అంగన్‌వాడీ టీచర్‌ నల్ల భారతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement