కాశిబుగ్గ: అర్హత కలిగిన ప్రతీ ఓటరు తుది జాబి తాలో ఉండేవిధంగా, ఎన్నికల నియమ, నిబంధనలకు అనుగుణంగా సర్ ప్రక్రియ నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎ్‌స్‌ఐఆర్ రోల్ అబ్జర్వర్ హరిచందన అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సర్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించారు. ఫామ్ 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారంపై ఆరా తీశారు. విచారణ నిర్వహించిన తీరును, ఇంటింటి సర్వే పర్యవేక్షణ వివరాలను పరిశీలించారు. బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వె వెళ్లి సేకరించిన వి వరాలు, ఫీల్డ్ వెరిఫికేషన్ వివరాలను సమీక్షించారు. అలాగే ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఆమోదించిన, తిరస్కరించిన దరఖాస్తులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు ఎల్.కిషోర్‌కుమార్, వైవీ గణేష్, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
‘జీవిత బీమా’ అమలులో పొరపాట్లు లేకుండా..
న్యూశాయంపేట: ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకం అమలులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులకు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి మండల త హసీల్దార్, ఎండీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా సమీక్షించారు. 18 నుంచి 59 సంవత్సరాల వ యస్సు కలిగిన ప్రతీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి రూ.5 లక్షల బీమా కవరేజ్ అందేలా చూడాలన్నా రు. దరఖాస్తుల నమోదుకు ప్రత్యేక కౌంటర్‌లు, హెల్ప్‌డెస్క్‌ల ద్వారా స్వీకరణ జరగాలన్నారు. వీసీ లో అదనపు కలెక్టర్ కిషోర్‌కుమార్, మున్సిపల్ క మిషనర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి అధికారులు పాల్గొన్నారు.
ఎ్‌స్‌ఐఆర్ రోల్ అబ్జర్వర్ హరిచందన


