న్యూస్‌రీల్
శ్రమే నా ఆయుధం..
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం సాయంత్రం ‘గరివిడి లక్ష్మి’ చిత్ర బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు గాదె శ్రవణ్‌కుమార్‌రెడ్డి, మోతుకూరి మయూరి, కమటం వేణుగోపాల్, చిదురాల అంజనీదేవి చిత్ర యూనిట్‌ను ఆలయ మర్యాదలతో స్వాగతించారు, అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.
హసన్‌పర్తి: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు హసన్‌పర్తికి చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల నగరంలో జరిగిన 70 ఎస్‌జీఎఫ్ ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–17 పోటీల్లో తనుశ్రీ(ఎస్సార్ కాలేజీ), ఎస్.లాస్య(మాంటిస్సోరి), బి.వైష్ణవి, పి.వరుణ్, ఇ.అభినవ్, జి.విశ్వతేజ (జెడ్పీఎస్‌ఎస్, హసన్‌పర్తి) పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 25 నుంచి రెండురోజుల పాటు హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో జరగనున్న రాష్ట్రపోటీల్లో వీరు పాల్గొంటారు. ఈసందర్భంగా శనివారం హసన్‌పర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడాకారులను కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు గొర్రె కిరణ్, మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, దేవస్థాన మాజీ చైర్మన్ ఆరెల్లి వెంకటస్వామి అభినందించారు.
కాశిబుగ్గ: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని డీఎంఈ డాక్టర్ వాణి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె నిర్మాణ పనులతోపాటు రోగులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. ఇప్పటికే ఓపీ సేవల ప్రారంభం కోసం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఫస్ట్ ఫ్లోర్‌లో చేసిన ఏరాట్లను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ విమలా థామస్, సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్, ఆర్‌ఎంఓ డాక్టర్ అశ్విని ఉన్నారు.
కమలాపూర్: మండలంలోని కానిపర్తికి చెందిన వీబీజీ రాంజీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ అక్రమాలపై జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం బహిరంగ విచారణ చేశారు. ఫీల్డ్‌అసిస్టెంట్ అశోక్ పలు అక్రమాలకు పాల్పడుతున్నాడని, కోరిన వారికి పని కల్పించకుండా తన బంధువులకు మాత్రమే జాబ్‌కార్డులు ఇప్పించుకున్నాడని, అక్రమంగా సంపాదించుకుంటున్నాడని, రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ ఇటీవల కొందరు గ్రామస్తులు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలపై విచారణ జరిపామని, విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. విచారణలో ఎంపీడీఓ గుండె బాబు, ఏపీఓ రమేశ్, ఈసీ కార్తీక్ పాల్గొన్నారు.
‘నా కల నిజం కావడానికి 11 ఏళ్లు పట్టింది. చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ, ఏకాగ్రతతో పట్టుదలతో చదివితే ఎవరైనా విజయం సాధించవచ్చు. పట్టు వదలకుండా కన్సిస్టెన్సీ మెయింటెయిన్ చేయడమే ఏ రంగంలోనైనా విజయానికి అసలైన రహస్యం’ అని ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై న భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన డ్యాగల సాయి పవన్ అంటున్నారు. సాయి పవన్ విజయ ప్రయాణం ఆయన మాటల్లోనే..
ఎన్నో వైఫల్యాలు.. చెరగని ఆత్మవిశ్వాసం
మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్న ఇద్దరూ ఉపాధ్యాయులే. చెల్లి బిట్స్ పిలానీ నుంచి కెమిస్ట్రీలో డాక్టరేట్ పొందింది. నాకు మొదటి నుంచి లా డిగ్రీ చేయాలన్నది బలమైన కోరిక. నాన్న సూచన మేరకు ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుని, హుజూరాబాద్‌లోని కిట్స్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ట్రిపుల్ ఈ) పూర్తి చేశాను. ఇంజనీరింగ్ పూర్తయ్యాక సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రిపేరవుతూనే దాదాపు 16 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యా. ఆర్మీ, కోస్ట్‌గార్డ్ వంటి ప్రతిష్టాత్మక డిఫెన్స్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకూ వెళ్లా. అయితే అదృష్టం కొన్నిసార్లు చిన్న తేడాతో దూరమయ్యేది. రెండు సార్లు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) పరీక్షలో కేవలం 3 సెకండ్లు, 0.14 మిల్లీసెకండ్ల వ్యవధితో ఈవెంట్స్ మిస్ అవడం తీవ్ర నిరాశను మిగిల్చింది. అయినా పట్టువదల్లేదు.
తలుపు తట్టిన విజయం
2018లో జీవితంలో నాకు తొలి విజయం తలుపు తట్టింది. దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎల్‌ఎల్‌బీ ఆనర్స్ ప్రవేశ పరీక్షను క్లియర్ చేసి అడ్మిషన్ పొందాను. అక్కడే లా పూర్తి చేశాక ఢిల్లీలోని ప్రముఖ లా ఫోరమ్స్‌లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అయినా వాటిని సున్నితంగా తిరస్కరించా. నా లక్ష్యం న్యాయమూర్తి (జడ్జి) కావాలనే కల వైపే నా అడుగులు పడ్డాయి.
సవాళ్లు, పాఠాలు
జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు సన్నద్ధమవడం మొదలుపెట్టాను. రెండు సార్లు ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే రెండోసారి కూడా చివరి దశలో సెలెక్ట్ కాకపోవడంతో కుంగిపోకుండా ఆత్మపరిశీలన చేసుకున్నాను. కేవలం కష్టపడితే సరిపోదని, ‘స్మార్ట్ వర్క్’ కూడా చాలా అవసరమని గ్రహించాను. నాతో పాటు ఇంటర్వ్యూ వరకు వెళ్లి, నాకు ముందు బ్యాచ్‌లలో జడ్జిలుగా ఎంపికై న నా మిత్రుల సహాయం తీసుకున్నాను. ప్రతీ దశకు ఒక స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించుకుని ప్రిపరేషన్ సాగించాను.
న్యూశాయంపేట: జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో కార్మికులకు, పరిశ్రమలకు అవసరమైన వసతుల కల్పనపై కలెక్టరేట్‌లో వరంగల్ కలెక్టర్ సత్యశారద శనివారం సమీక్ష నిర్వహించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్ ఎల్.కిశోర్‌కుమార్, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, సంగెం తహసీల్దార్ రాజ్‌కుమార్, ఆర్టీసీ డీఎం ధరమ్‌సింగ్, జోనల్ మేనేజర్ స్వామి, అధికారులు పాల్గొన్నారు. అలాగే, జాతీయ రహదారి 163జీ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద కలెక్టరేట్‌లో శనివారం సమీక్షించారు.
జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌చంద్ర
కాజీపేట అర్బన్ : యాసంగిలో వరి పంట వద్దని.. ఆరుతడి పంటలు సాగు చేయాలని హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌చంద్ర తెలిపారు. కాజీపేట మండలంలోని టేకులగూడెంలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖేత్ బచావో కార్యక్రమానికి ఆయన హాజరై రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో దృష్ట్యా భూగర్భ జలాలు తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున రైతులు వరి పంట సాగు చేసి నష్టపోకూడదని సూచించారు. భూగర్భ జలాలను కాపాడి, భవిష్యత్ పంటలకు భరోసా కల్పించాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కాజీపేట మండల వ్యవసాయాధికారి సంతోష్, ఏఈ అనిల్, ఏఈఓ సంధ్య, రైతులు పాల్గొన్నారు.
దామెర: రైతులకు సాగు నీరందించలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌజ్ సందర్శనలో భాగంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల బృందం హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రం సమీపంలో నీరులేని ఎస్సారెస్పీ కాల్వను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగు నీరందించాల్సిన కాల్వ ఎండిపోయి, రైతుల ఇబ్బందులకు అద్దం పడుతోందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటికి ప్రాధాన్యమిచ్చి రైతులను ఆదుకుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఎత్తిపోయకుండా, ఎల్‌నినో సాకు చూపుతూ వరి సాగు చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే కాల్వ ద్వారా నీరు విడుదల చేసి, చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీఎం రాజీనామా చేసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, వివేక్‌గౌడ్, కృష్ణారావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పరకాల మాజీ ఎ మ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, స్థానిక నాయకులు జాకీర్‌అలీ, కమలాకర్, రాజు, కుమార్, శరత్, కార్యకర్తలు ఉన్నారు.
దామెరలో ఎస్సారెస్పీ కాల్వను పరిశీలిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల బృందం
ఆదర్శం యువ జూనియర్ సివిల్ జడ్జిలు, ట్రెయినీ డీఎస్పీ..
గ్రామీణ నేపథ్యం.. ఉన్నత లక్ష్యాలు
వారి విజయ ప్రస్థానమే ‘సాక్షి’ సండే స్పెషల్


