వర్ధన్నపేట: ప్రజాప్రభుత్వంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణితో కలిసి శనివారం లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదకుటుంబాల్లో ఆడపి ల్లల వివాహాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతిపక్షాల ప్రచారాలను నమ్మవద్దని కోరారు. తక్కువ నీటితో ఎక్కువ పంట లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నేతావత్ షీభారాణి రాజేందర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్, పార్టీ మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు


