ఖానాపురం: మహిళలు వ్యాపారాలు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. బాలుతండాలో రూ.20 లక్షలతో జీపీ భవనానికి, ధర్మరావుపేటలో రూ.10 లక్షలతో మహిళా సంఘం భవనానికి శనివారం ఆయన శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడానికి కోటి రూపాయల రుణాలు ఇప్పిస్తానన్నారు. మహిళలు, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ద్వారా మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ హరిబాబు, సొసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీఓ అద్వైత, ఆత్మ చైర్మన్ ఎడ్ల భిక్షంరెడ్డి, సర్పంచ్లు మాడ్రాజు వెంకన్న, సునీత, అచ్యుతం, రాణి, రమేశ్, భానుప్రసాద్, ఎంపీఓ సునీల్కుమార్ పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి


