హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో కోటి రూపాయలతో తయారు చేసిన దారుమయ రథాన్ని ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ముందుగా కలశానికి పూజలు జరిపిన తర్వాత ఒక ఫీటు ముందుకు లాగి రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు. ఎల్‌నినో గండం నుంచి రక్షించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
ఏడో రోజుకు చేరిన నవరాత్రి ఉత్సవాలు
భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు శనివారం ఏడో రోజుకు చేరాయి. ప్రధానార్చకుడు భద్రకాళిశేషు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత పూజలు, నిత్యాహ్నికం జరిపి అమ్మవారి మూలమూర్తిని సరస్వతీదేవిగా అలంకరించారు. స్నపనమూర్తికి ఉదయం కాళరాత్రి, సాయంత్రం రక్తబీజహా క్రమాల్లో పూజలు చేసి రథోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, వాసుదేవరెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు
హాజరైన ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి


