వరంగల్ నగరంలో గాజులు కొనుగోలు చేస్తున్న మహిళలు
సాక్షి, నెట్వర్క్: జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం సాయంత్రం ఘనంగా జరుపుకోనున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో బతుకమ్మ సందడి నెలకొననుంది. బతుకమ్మలను పేర్చేందుకు శనివారం సాయంత్రమే మహిళలు గునుగు, తంగేడు, సీతజడ, బంతి, తామర పూలు, గుమ్మడి ఆకులు, సహజ రంగులను కొనుగోలు చేశారు. వరంగల్ చౌరస్తా, పిన్నావారి వీధి, పోచమ్మమైదాన్, రామన్నపేట, బట్టలబజార్, కాశిబుగ్గ తదితర ప్రాంతాలు కొనుగోళ్లతో కిక్కిరిసిపోయాయి. బతుకమ్మ ఆటస్థలాలు, చెరువులు, కుంటల వద్ద పలు శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైమాస్ట్ లైట్లు, తాగునీటి తదితర సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జోరుగా పూలు, పండుగ సామగ్రి కొనుగోళ్లు
చెరువులు, కుంటల వద్ద ఏర్పాట్లు చేసిన పలు శాఖల అధికారులు


