ఎఫెక్ట్‌.. | - | Sakshi
Sakshi News home page

ఎఫెక్ట్‌..

Oct 18 2026 1:30 AM | Updated on Oct 18 2026 1:30 AM

ఎఫెక్ట్‌..

బొంత విజయకు

చేయూత పింఛన్‌

● అధికారుల పునర్విచారణలో

అర్హురాలిగా గుర్తింపు

నల్లబెల్లి: లారీ ఉందనే సాంకేతిక కారణంతో రాంపూర్‌ గ్రామానికి చెందిన బొంత విజయ చేయూత పింఛన్‌ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. ‘చేయూతకు అడ్డంకులు’ శీర్షికన శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎంపీడీఓ పింగిళి రమణారెడ్డిని క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అధికారులు సమగ్రంగా విచారణ చేసి బొంత విజయ కుటుంబ వాస్తవ పరిస్థితుల ఆధారంగా పింఛన్‌కు పూర్తిగా అర్హురాలని తేల్చారు. దీంతో ఆమెకు త్వరలోనే పింఛన్‌ అందుతుందన్న ఆశలు చిగురించాయి. 360 డిగ్రీల పరిశీలనలో దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అర్హులు సంబంధిత అధికారులను సంప్రదిస్తే, మరోసారి విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎంపీడీఓ రమణారెడ్డి తెలిపారు.

‘సూపర్‌’ ఆస్పత్రి పరిశీలన

కాశిబుగ్గ: వరంగల్‌లో నూతనంగా నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ని డీఎంఈ డాక్టర్‌ వాణి శనివారం సందర్శించారు. ఈ నెల 20న విజయదశమి రోజును ఓపీ సేవలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆమె కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదతో కలిసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నూతన హాస్పిటల్‌లో పాత ఎంజీఎం, కేఎంసీ సూపర్‌ స్పెషాలిటీ సిబ్బందితో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజులు మాత్రమే ఓసీ సేవలకు ముహూర్తం ఉంది. దీంతో అధికారులు హెచ్‌ఓడీలతో సమావేశమవుతూ సమీక్ష చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement