నర్సంపేట: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో 2026–27విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మల్లం నవీన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ వి.పూర్ణచందర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ కొత్తగా అడ్మిషన్ పొందే విద్యార్థులు ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్, ఐటీఐ, ఒకేషనల్, 10 ప్లస్ 2 కోర్సు పాసైన విద్యార్థులు అడ్మిషన్ పొందేందుకు అర్హులన్నారు. రెండవ, మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అడ్మిషన్ ఫీజు చివరి తేదీ సెప్టెంబర్ 30వరకు ఉందన్నారు. పూర్తి వివరాలకు స్టడీ సెంటర్ 7382929577 నంబర్‌లో సంప్రదించాలన్నారు. ఆఫీస్ సిబ్బంది కే.నరేష్, బి.శివ తదితరులు ఉన్నారు.
‘దిగుమతి సుంకాన్ని
తగ్గించొద్దు’
నర్సంపేట: క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో దేశంలోని ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జిల్లా ఆయిల్‌పామ్ రైతు సంఘం అధ్యక్షుడు నంద్యాల కృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఒక వైపు ఆయిల్ పామ్ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తూనే, అదే పంట దిగుమతులను కూడా కేంద్రం ప్రోత్సహిస్తుందన్నారు. దీంతో దేశంలోని ఆయిల్‌పామ్ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సుంకాలకు సంబంధం లేకుండా ఆయిల్‌పామ్ రైతులకు నేరుగా టన్ను ఒక్కంటికి రూ.25వేల ధర ఉండేలా చట్టం చేయాలని కోరారు. క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి 40శాతం పన్ను అయినా విధించాలని, లేదంటే టన్నుకు రూ.25వేల ధర చట్టం చేయాలని కోరారు. లేదంటే ప్రస్తుతం ఉన్న సాగు ఖర్చులు, కూలీల కొరతతో ఆయిల్‌పామ్ రైతులకు తీవ్ర నష్టం జరిగి పంటలను వదిలేయాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుంచారపు వెంకట్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చాడ కొమురారెడ్డి, గుడిపూడి అరుణారామచందర్‌రావు, యాసం కుమారస్వామి, పండుగ నర్సిరెడ్డి, బుస్సారి బాబురావు, సమ్మయ్య, రామకృష్ణ, యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎంజీఎం డైటీషియన్‌గా మనోహర్‌రావు
కాశిబుగ్గ: ఎంజీఎం ఆస్పత్రి డైటీషియన్‌గా ఎం.మనోహర్‌రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీలో ఏఓగా పనిచేసి, ఇక్కడికి బదిలీపై వచ్చారు. గతంలో డైటీషియన్‌గా పనిచేసిన రవీందర్‌రెడ్డి నీలోఫర్ ఆస్ప్రతికి బదిలీ అయ్యారు.


