ఇద్దరు ఆడపిల్లలూ.. డాక్టర్లే..
కూతుర్ని చూసి గర్వపడుతున్నాం..
ఆదివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ఎయిర్‌పోర్ట్ పనుల్లో
వేగం పెంచండి
మామునూరు విమానాశ్రయం నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు.
హన్మకొండ : నిన్నుచూసి మేము తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడుచున్నాం. కూతురు సహనా రెడ్డి చిన్ననాటి నీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటా ఆనందం పొందుతున్నాం. విద్య అనేది భవిష్యత్తును మార్చే శక్తి అని ధృడంగా నమ్మి మా కూతురును చదివించాం. కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ పూర్తి చేసింది. మల్టీ నేషనల్ ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ కంపెనీలో ఏడాదికి రూ.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూ సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవడం మాకెంతో గర్వకారణం. మా ఆనందం.. ఆశలకు ప్రతీక అయిన నీవు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతశిఖరాలను అధిరోహించాలని, నేటి సమాజానికి మార్గదర్శకురాలిగా నిలవాలని కోరుకుంటున్నాం.
– గోపు రేణుకారెడ్డి – సమ్మిరెడ్డి, హనుమకొండ
కాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేటకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి గాండ్ల ప్రభాకర్–రమాదేవికి ఇద్దరు కుమార్తెలు మౌనిక, మేఘన. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్నా చింత లేకుండా వారిని చదివించారు. పెద్దమ్మాయి మౌనిక కేఎంసీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో పిడియాట్రిక్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉస్మానియా పరిధిలోని నీలోఫర్ ఆస్పత్రిలో డీఎం నియోనెటాలజీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా చిన్నమ్మాయి మేఘన కూడా తామేమి తీసిపోనట్లుగా ఒంగోలులోని రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం గుంటూరులోని మెడికల్ కాలేజీలో ఆప్తాల్మాజీలో సెకండియర్ చదువుతున్నారు. ‘మాకు కొడుకులు లేరన్న చింత లేదు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా లక్ష్మీదేవిలగా భావిస్తూ కష్టపడి చదివించాం. డాక్టర్లు కావడంతో మా జన్మ ధన్యమైంది.’అని తల్లిదండ్రులు ప్రభాకర్–రమాదేవి సగర్వంగా చెప్పారు.
నా పేరు డి.ప్రభాకర్.. మాది అశోక కాలనీ హనుమకొండ. మా బిడ్డ ప్రాంశుత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (MCJ) పూర్తి చేసింది. రెండు బంగారు పతకాలు సాధించి, గవర్నర్ చేతుల మీదుగా వాటిని ఈ ఏడాది సెప్టెంబర్ 8న అందుకున్న క్షణం మాకు ఎంతో గర్వకారణం.
నా పేరు పెద్దారపు రమేశ్. మాది నర్సంపేట పట్టణం. మాకు ఇద్దరు కూతుర్లు ప్రజ్వల, విప్లవ. సామాజిక చైతన్యం కలిగిన మాకు మా కూతుర్లు సైతం అదే దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. మా పిల్లలతో అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. మా పెద్ద కూతురు ప్రజ్వల ఫోరెన్సిక్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి పట్టా పొందారు. మా చిన్న కూతురు విప్లవ జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి పట్టా పొంది ఉన్నారు. మా కూతుర్లు నిత్యం మా శ్రేయస్సు కోరుతూ మాట్లాడడమే కాకుండా కుటుంబ అభ్యున్నతితో పాటు సమాజ మార్పు కోసం తమ శక్తి మేరకు పనిచేయాలని సంకల్పించడం మాకు ఎంతో గర్వకారణం. వారి పేర్లకు తగ్గట్టే భవిష్యత్‌లో వారి లక్ష్యాలు నెరవేరాలని ఆశిస్తున్నాం.
మా పేరు బొజ్జ మాధవి వేణుగోపాల్. మేం ఉండేది హనుమకొండ కాకతీయ కాలనీ. మాకు ఇద్దరు అమ్మాయిలు. భువన, చందన. పెద్దమ్మాయి 10 ఏళ్లుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. మా చిన్న కూతురు బీఫార్మసీలో గోల్డ్ మెడలిస్ట్. చదువు అయిపోగానే 1 ఇయర్ జాబ్ చేసి ఉన్నత చదువులకు కెనడా వెళ్లింది. అక్కడ చదువు పూర్తి చేసుకుని హెల్త్ అండ్ కేర్‌లో ఉద్యోగం చేస్తోంది. ఉన్నతంగా బతకాలనే వారి ఆశయాలు, వాళ్ల ధైర్యాన్ని చూసి మేం చాలా గర్వపడుతున్నాం.


