తగ్గిన సాగు విస్తీర్ణం! | - | Sakshi
Sakshi News home page

తగ్గిన సాగు విస్తీర్ణం!

Sep 27 2026 4:04 AM | Updated on Sep 27 2026 4:04 AM

సాక్షి, వరంగల్‌: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, వర్షపాతం లోటు, సాగునీటి లభ్యతపై అనిశ్చితి.. ఇవన్నీ కలిసి ఈసారి జిల్లాలో వానాకాలం సాగుపై ప్రభావం చూపాయి. ఖరీఫ్‌ సీజన్‌ మరో మూడు రోజుల్లో ముగియనుండడంతో ఇప్పటివరకు సాగైన పంటల విస్తీర్ణాన్ని పరిశీలిస్తే గతేడాదితో పోలిస్తే 6.7 శాతం తగ్గుదల కనిపిస్తోంది. గతేడాది 2,95,300 ఎకరాల్లో పంటలు సాగేతై ఈసారి ఇప్పటివరకు 2,75,500 ఎకరాల సాగు చేశారని వ్యవసాయ శాఖ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి విస్తీర్ణం ఈసారి తగ్గగా... మొక్కజొన్న, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. పత్తి మాత్రం స్వల్పంగా పెరిగింది. వర్షాలపై ఆధారపడే పరిస్థితుల్లో రైతులు నీటి అవసరం, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు వెళ్లినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

లోటు వర్షపాతం ఇలా..

జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలు వర్షపాతం వివరాలను పరిశీలిస్తే నాలుగు నెలలు కలిపి జిల్లా సగటు లోటు వర్షపాతం 31 శాతంగా ఉంది. నర్సంపేట మండలంలో 54.2 శాతం, నల్లబెల్లి మండలంలో 46.2 శాతం, ఖానాపురం మండలంలో 45.8 శాతం, నెక్కొండ మండలంలో 37.8 శాతం, ఖిలావరంగల్‌ మండలంలో 37.5, గీసుగొండ మండలంలో 31.2 శాతం, దుగ్గొండి మండలంలో 30.9 శాతం, సంగెం మండలంలో 29.5 శాతం, వరంగల్‌ మండలంలో 26.2 శాతం, పర్వతగిరి మండలంలో 25.5 శాతం, చెన్నారావుపేట మండలంలో 21.7 శాతం, రాయపర్తి మండలంలో 6.7 శాతం లోటు వర్షపాతంగా ఉంది. ఒక్క వర్ధన్నపేట మండలంలో మాత్రం 16 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

గతేడాదితో పోలిస్తే జిల్లాలో 19,800 ఎకరాలు తగ్గిన సాగు

మొక్కజొన్న, పప్పుధాన్యాలు,

కూరగాయల వైపు రైతుల మొగ్గు

మరో మూడు రోజుల్లో ముగియనున్న వానాకాలం సీజన్‌

గతేడాది సాగు విస్తీర్ణం :

2,95,300 ఎకరాలు

ఈ ఏడాది సాగు విస్తీర్ణం :

2,75,500 ఎకరాలు

తగ్గిన సాగు విస్తీర్ణం :

19,800 ఎకరాలు

పంట 2025 2026 వ్యత్యాసం

వరి 1,25,000 1,00,002 –24,998

పత్తి 1,10,200 1,12,044 +1,844

మొక్కజొన్న 8,000 18,966 +10,966

పప్పుధాన్యాలు 2,000 10,825 +8,825

పసుపు 900 735 –165

మిరప 8,000 5,234 –2,766

కూరగాయలు 2,500 4,009 +1,509

పండ్లు 7,150 7,275 +125

ఆయిల్‌పామ్‌ 7,800 6,782 –1,018

పూలు 300 226 –74

ఇతర పంటలు 2,750 1,284 –1,466

రెండు సంవత్సరాల్లో పంటల వివరాలు

(ఎకరాల్లో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement