కాజీపేట అర్బన్: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131 జయంతి సందర్భంగా శనివారం న్యూశాయంపేటలోని ఆమె విగ్రహానికి పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, రజక సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
యూజీడీపై సీడీఎంఏ సమీక్ష
వరంగల్ అర్బన్: వరంగల్ నగర సమగ్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా చేపట్టి, కార్యాచరణను వేగవంతం చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ, సీడీఎంఏ డాక్టర్ టి.కె శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ నగర యూజీడీ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. కమిషనర్ క్యాంపు కార్యాలయం నుంచి కమిసనర్ టి.వెంకన్న, ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ సాయపురెడ్డి, సంబంఽధిత ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


