హన్మకొండ/వరంగల్ చౌరస్తా: ప్రయాణికులకు మరింత మెరుగైన సమాచారాన్ని అందించడానికి హనుమకొండ బస్ స్టేషన్‌లో 24 గంటల పాటు విచారణ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల ఆర్పిత తెలిపారు. బస్సుల రాకపోకలు, సమయాలు, వివిధ రకాల బస్సుల వివరాలు, ఇతర ప్రయాణ సంబంధిత స మాచారం తెలుసుకోవడానికి విచారణ కౌంటర్లలో ప్రత్యేకంగా ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ప్రయాణికులు జిల్లా బస్ స్టేషన్ ఫోన్ నంబర్ 99592 26056, సిటీ బస్‌స్టేషన్ ఫోన్ నంబర్ 99592 26049లో సంప్రదించాలని కోరారు. అదేవిధంగా వరంగల్ బస్టాండ్‌లో 99592 26057 నంబర్ అందుబాటులో ఉంటుందని హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. ప్రయాణికులకు బస్ సమయాలు, రూట్ వివరాలు తెలుసుకోవడానికి 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. వరంగల్ బస్టాండ్ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల వివరాలతో పాటు సిటీ బస్సు ల సమాచారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సిటీలో వరంగల్, హనుమకొండ, కాజీపేటకు 1, 1 బీ, 3, 11 నంబర్ బస్సులు ఉదయం 5:30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రతీ 5 నిమిషాలకు అందుబాటులోఉంటాయని తెలిపారు. ఈఅవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


