ధర్మసాగర్/వేలేరు: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో గోదాముల నిర్మాణానికి స్థల పరిశీలన చేసినట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, వేలేరు మండలంలోని సోడాషపల్లిలో మార్కెట్ కమిటీ అధీనంలో ఉన్న స్థలాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక అనిల్, అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ముప్పారంలో మోడల్ స్కూల్, ప్రస్తుత గోదాములకు పోగా ఎంత స్థలం అందుబాటులో ఉందో 15 రోజుల్లో సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సరిహద్దులు నిర్ణయించి పూర్తిస్థాయి లేఅవుట్ మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు. 5 వేల నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏనుమాముల మార్కెట్ అధికారులను ఆదేశించారు. సోడాషపల్లిలో రూ.2 కోట్లతో నిర్మించిన సబ్‌మార్కెట్ యార్డు ఎందుకు నిరుపయోగంగా మారిందని అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమాల్లో మార్కె ట్ యార్డు వైస్ చైర్మన్ బండి జనార్దన్, సెక్రటరీ శ్రీనివాస్, తహసీల్దార్లు కోమి, భావుసింగ్, ఎంపీడీఓలు కిషన్, అనిల్‌కుమార్, ఏఓ కవిత, సర్పంచ్‌లు గుంటిపల్లి రేణుక, బిల్లా యాదగిరి, అశోక్, శ్రీనివాస్, అనిత, మానస, రమాదేవి, రాజు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ముప్పారం, సోడాషపల్లిలో
అధికారులతో స్థలాల పరిశీలన


