దొడ్డు బియ్యం తరలించాలి | - | Sakshi
Sakshi News home page

దొడ్డు బియ్యం తరలించాలి

Aug 31 2026 3:14 AM | Updated on Aug 31 2026 3:14 AM

దొడ్డు బియ్యం తరలించాలి ఉన్నతాధికారుల అనుమతి రాలేదు

17 మాసాలుగా దొడ్డు బియ్యం నిల్వలు జిల్లాలోని మెజార్టీ షాపుల్లో ఉన్నాయి. రేషన్‌ షాపునకు యజమానులు గదులు అద్దెకు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. ఉన్న ఇరుకు గదుల్లో దొడ్డు బియ్యం నిల్వలు ఉండగా సన్న బియ్యం దిగుమతి చేసుకోవటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దొడ్డు బియ్యం ముక్కిపోయి, రంగు మారడంతోపాటు లక్కపురుగు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. అధికారులు స్పందించి దొడ్డు బియ్యం నిల్వలను ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించాలి.

– దారవత్‌ మోహన్‌నాయక్‌, రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు

జిల్లాలోని రేషన్‌ షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వ లు ఉన్నది వాస్తవమే. గోదాముల్లోకి దొడ్డు బియ్యం తరలింపునకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. అనుమతి రాగానే తరలింపునకు చర్యలు తీసుకుంటాం.

– కిష్టయ్య,

జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement