వరంగల్ చౌరస్తా: బాలలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, సానుకూల దృక్పథంతో వారి భవిష్యత్‌కు బాటలు వేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ సూచించారు. వరంగల్ ఆటోనగర్‌లోని బాలుర పరిశీలక వసతి గృహాన్ని శనివారం సాయంత్రం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సదుపాయాలను పరిశీలించారు. బాలలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. బాలల హక్కుల పరిరక్షణ, ఉచిత న్యాయ సహాయంపై కృషి చేయాలని హోం సూపరింటెండెంట్ శ్రీదేవికి పూజ పలు సూచనలు చేశారు. తనిఖీల్లో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్.రజినీ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి కందుకూరి పూజ


