రైతు బీమాను రెన్యువల్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతు బీమాను రెన్యువల్‌ చేయాలి

Aug 24 2026 1:25 AM | Updated on Aug 24 2026 1:25 AM

రైతు బీమాను రెన్యువల్‌ చేయాలి ఆదేశాలు రాలేదు

రైతు కుటుంబాలకు భరోసాగా నిలిచే రైతు బీమాను ప్రభుత్వం వెంటనే రెన్యువల్‌ చేయాలి. బీమా గడువు ముగియడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది. రైతుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే బీమా రెన్యువల్‌ ప్రక్రియను పూర్తి చేయాలి. అర్హులైన ప్రతీ రైతుకు బీమా సౌకర్యం కొనసాగించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.

సోమిడి శ్రీనివాస్‌,

రాష్ట్ర కన్వీనర్‌, తెలంగాణ రైతు సంఘం

రైతుబీమా పునరుద్ధరణ, దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. గతంలో ఆగస్టు 13 నాటికి దరఖాస్తుల స్వీకరించి, పాతవాటిని పునరుద్ధరణ చేశాం. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే రైతుబీమా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం.

– విజయభాస్కర్‌,

జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement