జిల్లా సమగ్రాభివృద్ధికి పెద్దపీట
న్యూస్‌రీల్
వరంగల్
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
భక్తులకు ఇబ్బంది కలగకుండా సేవలు
మేడారం భక్తులకు ఇబ్బంది కలగకుండా మెరుగైన రవాణా సేవలు అందించాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి అన్నారు.
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ ఉంటుంది. రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది.
ఖిలా వరంగల్: ప్రజా పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతూ జిల్లా సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఖుష్‌మహల్ మైదానంలో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవంలో జాతీయ జెండాను కలెక్టర్ సత్యశారద ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎంపికై న 252 మంది ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు ఉత్తమ సేవా అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
రైతు సంక్షేమమే ధ్యేయం
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెట్టపీట వేస్తోందని కలెక్టర్ తెలిపారు. వానాకాలంలో 1,56,400 మంది రైతులకు 2,70,618 ఎకరాలకు నేరుగా వారి ఖాతాల్లో రూ.162.30 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు గుర్తు చేశారు. 54,226 మంది రైతులకు రూ.422.37 కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. రైతుబీమా కింద 137 మంది రైతుల కుటుంబాలకు రూ.6కోట్ల 85 లక్షలు అందించామని, కిసాన్ సమ్మాన్ నిధి కింద 71,250 మంది రైతుల ఖాతాల్లో రూ.14.25 కోట్లు జమ వేశామని పేర్కొన్నారు. మొంథా తుఫాన్ కారణంగా 22,860 మంది రైతులకు రూ.20.54 కోట్ల పరిహారం అందించామని అన్నారు. జిల్లాలో 2,93,763 ఎకరాలకు సాగునీరు అందజేస్తున్నామని, 2025 – 26 ఖరీఫ్ సీజన్‌లో 261 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,61,939 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ వివరించారు. వందశాతం గుడుంబాను నిర్మూలించామని, 1,400 మంది గీత కార్మికులకు కాటమయ్య కిట్లు అందజేశామని, గాయపడి, మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు. మత్స్యశాఖ ద్వారా 8,810 టన్నుల చేపలు, 235 టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేసి, 100 శాతం సబ్సిడీతో రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో 5,928 లక్షల చేప విత్తనాలను 100శాతం సబ్సిడీపై సరఫరా చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో 15,821 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
మహిళలను కోటీశ్వరులను చేయాలని..
మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంగా బ్యాంకు లింకేజీ కింద 11,112 స్వశక్తి సంఘాలకు రూ.1094.14 కోట్లు మంజూరు చేశామని, శ్రీనిధి కింద రూ.114.40 కోట్ల రుణాలు, రూ.44.25 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద 1,712 మంది ఆడపిల్లల పెళ్లిలకు రూ.17.13,98 కోట్లు అందజేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 6,391 మందికి రూ.134.30 కోట్లు కేటాయించామని, 6,391 మంది డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు ఖాతాల్లో రూ.134.30 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. అభయ హస్తం కింద 5.99 కోట్ల మంది మహిళలకు రూ.247.57 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి వారి ద్వారా 452 పాఠశాలల్లో 17.90 కోట్లు ఖర్చుతో మౌలిక వసతులు కల్పించామని, 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. చేయూత పెన్షన్ కింద రూ.29.23 కోట్లు, ఉపాధి హామీ పథకం కింద 41.97 లక్షల పనిదినాలకు రూ.111.75 కోట్లు కూలీలకు చెల్లించినట్లు కలెక్టర్ వివరించారు.
విద్యా, వైద్యానికి ప్రాధాన్యం
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 163 కొత్త వ్యాధులకు సైతం వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ సత్యశారద తెలిపారు. 24 అంతస్తుల ఆస్పత్రి భవనం నిర్మాణంలో ఉందని, ఏప్రిల్ నాటికి పూర్తిచేసి, వైద్య సేవలను అందిస్తామని అన్నారు. జిల్లాలోని 24 ప్రాథమిక పశు వైద్యశాలలు, 31 గ్రామీణ పశువైద్య కేంద్రాల ద్వారా 1.89 లక్షల పశువులు, 6.95 లక్షల మేకలు, గొర్రెలకు వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. 919 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా విద్యను అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 509 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెలా 5,516 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని, శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సత్యశారద వివరించారు.
ఖుష్‌మహల్ మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ సత్యశారద సందర్శించారు. ఆసక్తిగా తిలకించి అధికారులను అభినందించారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో దేశభక్తిని చాటేలా నిర్వహించిన సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు కనువిందు చేశాయి. జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
శరవేగంగా అభివృద్ధి పనులు
జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ సత్యశారద తెలిపారు. మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.295 కోట్లు విడుదల చేయగా, 253 ఎకరాల అదనపు భూమి సేకరించామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని అన్నారు. రాతికోట చుట్టూ రూ.2 కోట్ల వ్యయంతో మోటు పునరుద్ధరణ పనులు, ఇన్నర్‌రింగ్ రోడ్డు, నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు, రూ.80 కోట్ల అంచనా వ్యయంతో సమీకృత కలెక్టరేట్, నివాస గృహాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. నగరంలో 2057 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని రూ.4,170 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ వ్యవస్థకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వరంగల్ పాత బస్‌స్టేషన్ స్థలంలో రూ.120 కోట్ల ఖర్చుతో ఐదు అంతస్తులతో అధునాతన సౌకర్యాలతో కూడిన భవనం నిర్మిస్తున్నామన్నారు. పాకాలలోని ఫారెస్ట్ పార్కులో సీతాకోక చిలుకల వనం ఏర్పాటు చేశామని, భద్రకాళి చెరువు ముంపు నివారణకు రూ.158 కోట్లు, పర్వతగిరి, తీగరాజు పల్లి గ్రామాల్లో క్రాస్ రెగ్యులేటర్ పనులకు రూ.5,570 కోట్లు, మెగా టెక్స్‌టైల్ పార్కులో రూ.160 కోట్లతో ఏడు చెక్ డ్యాములు నిర్మాణాల్లో ఉన్నాయని వివరించారు. వేడుకల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, ఆర్టీఓ సుమ, ఏఆర్‌డీసీపీ శ్రీనివాస్, పరేడ్ కమాండర్ ఏఆర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రైతు అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి
మహిళా సాధికారతే లక్ష్యం
విద్యా, వైద్యం, శాంతిభద్రతలకు
అధిక ప్రాధాన్యం
జాతీయ జెండా ఆవిష్కరించి
జిల్లా ప్రగతిపై ప్రసంగించిన
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
252 మంది ఉత్తమ అధికారులకు ప్రశంసపత్రాల ప్రదానం
ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు
ఆకట్టుకున్న స్టాళ్లు, అలరించిన నృత్య ప్రదర్శనలు
జిల్లా సమగ్రాభివృద్ధికి పెద్దపీట
జిల్లా సమగ్రాభివృద్ధికి పెద్దపీట
జిల్లా సమగ్రాభివృద్ధికి పెద్దపీట
జిల్లా సమగ్రాభివృద్ధికి పెద్దపీట
జిల్లా సమగ్రాభివృద్ధికి పెద్దపీట
జిల్లా సమగ్రాభివృద్ధికి పెద్దపీట
జిల్లా సమగ్రాభివృద్ధికి పెద్దపీట


