సమగ్రాభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమగ్రాభివృద్ధే లక్ష్యం

Jan 27 2026 7:28 AM | Updated on Jan 27 2026 7:28 AM

సమగ్ర

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం మహాజాతరకు ముస్తాబు త్రివర్ణాలతో రుద్రేశ్వరస్వామికి అలంకరణ సమానంగా ఆదరించాలి మేడారం బస్‌పాయింట్‌ తనిఖీ కాజీపేట బ్రిడ్జిపై నిలిచిన వాహనాలు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు బీజేపీకి ‘అరూరి’ గుడ్‌బై ఉపాధి పథకాన్ని పునరుద్ధరించాలి

న్యూస్‌రీల్‌

9

లోu

8

లోu

న్యూజిలాండ్‌ టు మేడారం

ఆదివాసీ సాంస్కృతిక

సంబురం!

మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
అర్హులందరికీ సంక్షేమ పథకాలు : గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ స్నేహ శబరీష్‌
మరిన్ని ఫొటోలు..
మహాజాతరకు ముస్తాబు

పాట పాడుతున్న గాయకుడు శ్రీరాంచంద్ర, ర్యాంప్‌ వాక్‌ చేస్తున్న విద్యార్థులు

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వెండి కవచానికి జాతీయ జెండా వర్ణాలైన త్రివర్ణాలను అద్ది తెల్లజిల్లెడు పూలమాలలతో అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్‌ స్వామివారికి రుద్రాభిషేకం, పూజలు జరిపారు. శివ ప్రీతికరమైన సోమవారం వందలాది మంది భక్తులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

ఎంజీఎం: పుట్టబోయే బిడ్డ ఆడైనా, మగైనా తల్లిదండ్రులు సమానంగా ఆదరించాలని హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ తెలిపారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ సందర్శించారు. ‘బాలికా పరిరక్షణ–తల్లిదండ్రులకు అవగహన’పై చేపడుతున్న కార్యక్రమాలకు సంబంఽధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీ ధార కవిత, అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ఆర్డీఓ రాథోడ్‌ రమేశ్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్‌రావు, ప్రోగ్రాం అధికారి శ్రీని వాస్‌, డెమో వి.అశోక్‌ రెడ్డి తదితరులున్నారు.

కాజీపేట రూరల్‌: కాజీపేట రైల్వే స్డేడియంలో ఏర్పాటు చేసిన మేడారం జాతర ఆర్టీసీ బస్‌ పాయింట్‌ను సోమవారం టీజీఎస్‌ ఆర్టీసీ కరీంనగర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాల్మన్‌ తనిఖీ చేశారు. రెండో రోజు వరంగల్‌ ఆర్టీసీ–2 డిపో మేనేజర్‌ ఎం.రవిచందర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ భవాని, ఇన్‌చార్జ్‌ బైరి రవీందర్‌, ఆర్టీసీ సిబ్బంది 19 బస్సుల్లో 644 మంది ప్రయాణికులను మేడారానికి పంపించారు. వాసవి క్లబ్‌ వారు ప్రయాణికుల కోసం ఉచిత మినరల్‌ వాటర్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.

కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై సోమవారం రాత్రి రెండు వాహనాలు సాంకేతిక లోపంతో నిలిచిపోయాయి. దీంతో అరగంటకు పైగా ఇరువైపులా ట్రాఫిక్‌ స్తంభించింది. హనుమకొండ వైపు వెళ్తున్న ఓ కారు, ఎలక్ట్రికల్‌ బస్సు బ్రిడ్జిపైకి రాగానే సాంకేతిక లోపం తలెత్తడంతో ఆగిపోయాయి. దీంతో బ్రిడ్జికి రెండు వైపులా వాహనాలు బారులుదీరాయి. మేడారం జాతరకు వెళ్లే వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం అందుకున్న సీఐలు సుధాకర్‌రెడ్డి, వెంకన్న సిబ్బందితో అక్కడికి చేరుకుని వన్‌ వే పద్ధతిలో వాహనాలు కొద్దిసేపు పంపించి పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

హన్మకొండ అర్బన్‌: ‘జిల్లాను వ్యవసాయ, పరిశ్రమలు, విద్య, ఆరోగ్య, మహిళా సాధికారత, మౌలిక వసతులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం’ అని హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. సోమవారం నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన 77వ భారత గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ స్నేహ శబరీశ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

రాష్ట్ర అభివృద్ధిలో జిల్లా పాత్ర కీలకం

జిల్లాకు సంబంధించిన ప్రగతి నివేదికపై కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో హనుమకొండ జిల్లా పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తూ హనుమకొండ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో సాధించిన పురోగతిని ప్రజలకు తెలియజేయడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

వ్యవసాయ రంగాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకుని రైతు భరోసా, రైతు బీమా, ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 1.58 లక్షల మంది రైతులకు రూ.157.23 కోట్ల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. రైతు బీమా పథకం కింద మరణించిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. యాసంగి పంట కాలానికి అవసరమైన యూరియాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నట్లు వివరించారు.

పౌర సరఫరాలు.. పేదలకు భరోసా

రేషన్‌ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రతీ నెలా ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా వేలాది రేషన్‌ కార్డులు మంజూరు చేసి కుటుంబ సభ్యులను చేర్చినట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తూ లక్షలాది కుటుంబాలకు ఊరట కల్పిస్తున్నామని చెప్పారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు కోట్ల రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.

గృహ కల నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్లు

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో వేల సంఖ్యలో గృహాలు మంజూరు చేసి, పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణంలోనూ గణనీయమైన పురోగతి సాధించినట్లు ఆమె పేర్కొన్నారు.

వైద్య, ఆరోగ్య సేవల విస్తరణ

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్‌ ఆస్పత్రుల వరకు విస్తృతంగా వైద్య సేవలు అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేలాది మందికి ఖరీదైన చికిత్సలను ప్రభుత్వ ఖర్చుతో అందించినట్లు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా క్లినిక్‌ల ద్వారా సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు.

మహిళా సంక్షేమానికి పెద్దపీట

మహిళల సాధికారతే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ స్పష్టం చేశారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద జిల్లాలో కోట్ల సంఖ్యలో జీరో టికెట్‌ ప్రయాణాలు నమోదైనట్లు తెలిపారు. మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా పలు ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు చెప్పారు.

గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన

ఉపాధి హామీ పథకం ద్వారా లక్షలాది పని దినాలు కల్పించి కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు తెలిపారు. వన మహోత్సవం కింద లక్షల సంఖ్యలో మొక్కలు నాటామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

విద్యలో నాణ్యతపై దృష్టి

ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యత పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 96 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని తెలిపారు. కేజీబీవీలు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ విద్య అందిస్తున్నట్లు చెప్పారు.

మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి

కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో మాస్టర్‌ ప్లాన్‌–2041 అమలుతో పట్టణాభివృద్ధికి దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, కళాక్షేత్రాలు, జంక్షన్ల అభివృద్ధి వంటి కీలక పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు.

పథకాల అమలులో ముందంజ

షెడ్యూల్డ్‌ కులాలు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీల కోసం స్కాలర్‌షిప్‌లు, వసతి గృహాలు, ఓవర్సీస్‌ విద్యా నిధులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులకు పింఛన్లు అందిస్తూ సామాజిక భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ఉత్తములకు ‘ప్రశంస’లు..

విధుల్లో ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సామాజిక సేవలు అందించిన పలువురికి కలెక్టర్‌ ప్రశంస పత్రాలు అందించారు. స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. డీఆర్డీఓ, మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య, టెస్కో, హౌజింగ్‌, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ధార కవితతో కలిసి తిలకించారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నగర మేయర్‌ గుండు సుధారాణి, ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, డీఆర్‌ఓ వైవీ గణేశ్‌, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్‌ రమేశ్‌ అధికారులు పాల్గొన్నారు.

ఎల్కతుర్తి: ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. సోమవారం భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లిలో గ్రామస్తులు బతుకమ్మ ఆడుకోవడానికి లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి ఎకరం స్థలం కేటాయించగా.. ఆస్థలంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ బతుకమ్మ బండ ఆటస్థలానికి భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బతుకమ్మ ఆడుకోవడానికి స్థలం విరాళంగా ఇచ్చినందుకు మంత్రి తిరుపతిరెడ్డిని అభినందించారు. బతుకమ్మ ఆడుకోవడానికి ఉపయోగపడేలా ఈ స్థలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతీ మండలానికి ఒక మెడికల్‌ కాలేజీ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల సేకరణకు రూ.50కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కాలువ వెళ్తున్న రైతులు భూమి ఇచ్చి సహకరించాలని కోరారు. భూసేకరణ పూర్తయితే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్‌ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నట్లు వెల్ల డించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలకు నియోజకవర్గంలో ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు.

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : ఆదివాసీల అతి పెద్ద ఉత్సవం, తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాబైంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు రెండు వారాల ముందునుంచే గిరిజన సంప్రదాయాల ప్రకారం గుడిమెలిగె, మండమెలిగె తదితర పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఓ వైపు సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు జరుగుతుండగానే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాగా, ఈ నెల 28న సారలమ్మ రాకతో మొదలయ్యే జాతర 31 వరకు కొనసాగుతుంది. ఈ మేరకు జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ముస్తాబైన నయా మేడారం..

మేడారం చరిత్రలోనే తొలిసారిగా రూ.251 కోట్ల భారీ నిధులు కేటాయించారు. ఇందులో గద్దెల శాశ్వత పునరుద్ధరణకు రూ.101 కోట్లు, జాతర నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు రూ.150 కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. ఇది మేడారం చరిత్రలోనే అత్యధిక కేటాయింపు కావడం విశేషం. మేడారం అభివృద్ధి పనుల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నవి కొత్తగా నిర్మించిన శాశ్వత గద్దెలు. వీటితోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను గ్రానైట్‌ రాళ్లతో పునర్నిర్మించారు. ప్రాకారం చుట్టూ ఉన్న రాతి శిలలపై కోయ గిరిజనుల వీరగాథలు, సమ్మక్క–సారలమ్మ చరిత్ర, ఆదివాసీల గోత్రాలు, వారి ఆచార వ్యవహారాలు, వీరగాథలను ప్రతిబింబించే చిత్రాలను చెక్కారు.

భద్రత వలయంలో మేడారం..

గతంలో వనదేవతల గద్దెల ప్రాంతంలో 2–3 వేల మంది ఉంటేనే తొక్కిసలాట జరిగేది. ఈసారి పునరుద్ధరణలో భాగంగా ఒకేసారి 7వేల నుంచి 8 వేల మంది భక్తులు దర్శించుకునేలా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేక లైన్లు, క్యూలైన్లపై జీఐ షీట్లతో పైకప్పు ఏర్పాటు చేశారు. నాలుగు గద్దెలను ఒకేసారి దర్శించుకునేలా కంపార్టుమెంట్లు నిర్మించారు. మేడారం చుట్టూ 10 కిలోమీటర్ల మేర ఫోర్‌ లేన్‌ రోడ్లు, పార్కింగ్‌కు అదనంగా 63 ఎకరాల స్థల సేకరణ చేశారు. కాగా, ఈసారి 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 460 సీసీ కెమెరాలు, ఆర్టిిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టెక్నాలజీ ద్వారా రద్దీని పర్యవేక్షించే సిస్టం ఏర్పాటు చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి రద్దీని పర్యవేక్షిస్తూ, ప్రమాదాల్ని ముందుగానే నివారించే ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. 20 ప్రత్యేక డ్రోన్ల ద్వారా క్రౌడ్‌ మేనేజ్మెంట్‌, 20 మంది ఐపీఎస్‌ అధికారులు, 30 వేల మంది సిబ్బంది జాతర విధుల్లో ఉండనున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రతీ 2 కిలోమీటర్లకు ఒక చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు.

నృత్యం చేస్తున్న న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగ ప్రతినిధులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

ర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత అరూరి రమేశ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపారు. అనంతరం పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అరూరి రమేశ్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ఆయన వరంగల్‌ నుంచి పార్టీ టికెట్‌ ఆశించారు. అప్పటికే స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి.. తన కూతురు కావ్య వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని పట్టుబట్టడంతో బీఆర్‌ఎస్‌ అధిష్టానం కొద్ది రోజులు ఎటూ తేల్చకపోవడంతో కడియం శ్రీహరి తన కూతురు వైపే మొగ్గు చూపుతున్నారని భావించిన రమేశ్‌ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రమేశ్‌ పార్టీ మారకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వద్దకు చేర్చారు. కేసీఆర్‌తో పాటు ఉమ్మడి వరంగల్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ మారొద్దని రమేశ్‌కు హితవు పలికారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన తనను ఎంపీ టికెట్‌ రేసులో పరిగణనలోకి తీసుకోపోవడంపై రమేశ్‌ మనస్తాపం చెందారు. బీజేపీలో చేరేందుకు వెళ్తున్న రమేశ్‌ కాన్వాయ్‌ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఇతర నాయకులు అడ్డగించగా.. ఆ వాహనాలను జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా అడ్డుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత రమేశ్‌ బీజేపీలో చేరి వరంగల్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన కొద్ది రోజులుగా స్తబ్ధంగా ఉంటున్నారు. ఆదివారం అరూరి తల్లి సంవత్సరీకం జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం ఉప్పుగల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు మంతనాలు జరిపినట్లు సమాచారం. అక్కడినుంచే మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడించినట్లు తెలిసింది. ఈమేరకు మంగళవారం బీజేపీ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. కాగా, త్వరలోనే అధిక సంఖ్యలో కార్యకర్తలతో తరలి వెళ్లి కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది.

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ‘కుడా’ చైర్మన్‌, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల

ఆత్మకూరు: ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాన్ని పునరుద్ధరించాలని, వీబీజీరామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం టీపీసీసీ, ఏఐసీసీ ఆదేశానుసారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహక్కును కాలరాస్తూ జీపీల అధికారాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. కొత్తచట్టంతో సాంకేతిక సమస్యలు వస్తాయని, పట్టణాలకు వలసలు పెరిగి గ్రామీణ జీవనప్రమాణాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పర్వతగిరి మహేశ్వరి, ఉపసర్పంచ్‌ బాషబోయిన పైడి, నాయకులు కమలాపురం రమేశ్‌, బయ్య కుమారస్వామి, డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, ఏరుకొండ రవీందర్‌గౌడ్‌, పరికిరాల వాసు పాల్గొన్నారు.

ఉత్తమ ఉద్యోగులు, సామాజిక

సేవలందించిన పలువురికి

ప్రశంస పత్రాలు

అలరించిన విద్యార్థుల

సాంస్కృతిక ప్రదర్శనలు

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ

మంత్రి పొన్నం ప్రభాకర్‌

రంగయ్యపల్లిలో బతుకమ్మ ఆట స్థలానికి భూమి పూజ

రేపటినుంచే మేడారంలో తెలంగాణ కుంభమేళా

రూ.251 కోట్లతో పునరుద్ధరణ,

జాతర నిర్వహణ పనులు

జాతర ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రకటన,

దర్శనానికి తరలివస్తున్న భక్తులు

28 నుంచి 31 వరకు మహా జాతర..

3 కోట్లమంది వస్తారని అంచనా

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

కేసీఆర్‌ ఫోన్‌.. త్వరలో బీఆర్‌ఎస్‌లోకి..

ఆకట్టుకున్న న్యూజిలాండ్‌ గిరిజనుల

సాంస్కృతిక నృత్యం

నృత్యం.. ఆదివాసీల జీవనాడి,

గుండె చప్పుడు

– ఎస్‌ఎస్‌తాడ్వాయి/ ఏటూరునాగారం

సమగ్రాభివృద్ధే లక్ష్యం1
1/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం2
2/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం3
3/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం4
4/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం5
5/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం6
6/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం7
7/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం8
8/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం9
9/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం10
10/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం11
11/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం12
12/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం13
13/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం14
14/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

సమగ్రాభివృద్ధే లక్ష్యం15
15/15

సమగ్రాభివృద్ధే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement