గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సంపత్‌కుమార్
రాయపర్తి: తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన నాళ్ల సంపత్‌కుమార్‌గౌడ్‌ను నియమించినట్లు తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మ ణ్‌గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నియామక పత్రం అందించారు. గౌడ సంఘం కోసం సంపత్‌కుమార్ చేస్తున్న కృషిని గుర్తించి నియమించినట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడితో ఉపాధ్యక్షుడు పట్టాపురం ఏకాంతంగౌడ్, జిల్లా అధ్యక్షుడు కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్‌కు సంపత్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.


