వీరభద్ర శరభ.. శరభ
ఎల్కతుర్తి: కోనేటిలో స్నానాలు ఆచరించిన భక్తులు అగ్నిగుండాన్ని దాటుతూ వీరభద్ర శరభ.. శరభ అంటూ స్వామివారిని స్మరించుకున్నారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ ఆవరణలో భంగిమఠం పరమేశ్వరయ్య పూజలు చేసిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించారు. అగ్నిగుండాలపై నడిచిన భక్తుల దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. ఆలయ ఈఓ కిషన్‌రావు, చైర్మన్ అశోక్‌ముఖర్జీ, సీఐ పులి రమేశ్, ఎస్సైలు ప్రవీణ్‌కుమార్, రాజు, దివ్య, అర్చకులు, ధర్మకర్తలు, భక్తులు అగ్నిగుండంలో నడిచి భక్తిని చాటుకున్నారు. సాయంత్రం స్వామి వారి గ్రామ పర్యటనలో భాగంగా భద్రకాళి సమేత వీరభద్రుడికి మొక్కులు చెల్లించారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కాగా, అగ్నిగుండంలో నడుస్తున్న ఓ భక్తుడు కిందపడడంతో స్వల్పంగా గాయపడ్డాడు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కొత్తకొండలో వైభవంగాఅగ్నిగుండం నిర్వహణ
ముగిసిన బ్రహ్మోత్సవాలు


