
జనహిత పాదయాత్ర
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరిధి ఇల్లంద మార్కెట్ నుంచి మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ వరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్ర నిర్వహించారు. వారి వెంట మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ శ్రేణులు నడిచారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. అనంతరం అంబేడ్కర్ సెంటర్‌లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ముఖ్యనేతలు ప్రసంగించారు. – సాక్షి, వరంగల్