ఉదయం 9.30 గంటలకే పతాకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఉదయం 9.30 గంటలకే పతాకావిష్కరణ

Aug 14 2025 7:10 AM | Updated on Aug 14 2025 7:11 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం పంద్రాగస్టు రోజున జిల్లాకేంద్రాల్లో ఉదయం 9.30 గంటలకే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌లో జిల్లాల వారీగా వేడుకలకు హాజరయ్యే మంత్రులు/ప్రముఖుల జాబితాను బుధవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు విడుదల చేశారు. హనుమకొండ జిల్లా పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వరంగల్‌లో రెవెన్యూశాఖ, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ములుగులో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క జాతీ య పతాకాలను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా మహబూబాబాద్‌లో డిప్యూటీ స్పీకర్‌ జె.రామచంద్రునాయక్‌, జనగామలో ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, జయశంకర్‌ భూపాలపల్లిలో ఎస్‌టీ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బెల్లయ్య నాయక్‌లు జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌లో గౌరవ వందనం స్వీకరిస్తారని, ఏర్పాట్లు చేయాలని చీఫ్‌ సెక్రటరీ ఆ ఉత్తర్వులో జిల్లా కలెక్టర్‌లకు సూచించారు.

పంద్రాగస్టు వేడుకలకు

ప్రభుత్వం ఉత్తర్వులు

హనుమకొండకు

మంత్రి కొండా సురేఖ.. వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

ఉదయం 9.30 గంటలకే పతాకావిష్కరణ1
1/1

ఉదయం 9.30 గంటలకే పతాకావిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement