‘బుద్దారం’ భూ నిర్వాసితులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘బుద్దారం’ భూ నిర్వాసితులను ఆదుకోవాలి

Oct 19 2026 12:37 AM | Updated on Oct 19 2026 12:37 AM

వనపర్తి రూరల్‌: బుద్దారం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్‌ విలువకు మూడింతల నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్‌ బుద్దారం భూ నిర్వాసితుల పోరాట కమిటీతో ఆధ్వర్యంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి రైతుల 8 డిమాండ్లపై ఆయనతో చర్చించారు. రిజర్వాయర్‌ రెండోదశ నిర్మాణ పనుల్లో 135 మంది రైతులు 101.33 ఎకరాల భూమి కోల్పోతున్నారని.. ప్రభుత్వం ఎకరాకు రూ.15 లక్షల పరిహారం ప్రకటించిందని, భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్‌ విలువ రూ.15.75 లక్షలు ఉందన్నారు. చట్టం ప్రకారం మూడింతలు రూ.47.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ముంపునకు గురవుతున్న భూముల్లో బోరుబావులు, పైపులైన్లు, కొబ్బరి, మామిడి, టేకు చెట్లు ఉండటంతో అదనంగా పరిహారం చెల్లించాలని కోరారు. 18 ఏళ్లు నిండిన యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పేట–కొడంగల్‌ మాదిరి ప్రత్యేక జీఓ తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలని.. లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని వివరించారు. పరిహారం పెంపుపై మరోసారి చర్చించి ప్రయత్నం చేస్తామని, ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మధు, కృష్ణ, శేఖర్‌, సాంబయ్య, ధర్మారావు, కావలి ఆంజనేయులు, కావలి జంబులయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement