‘మేఘా’ చేయూత | - | Sakshi
Sakshi News home page

‘మేఘా’ చేయూత

Oct 2 2026 12:34 AM | Updated on Oct 2 2026 12:34 AM

సాయం చేస్తే తృప్తి..

ఆపదలో ఉన్న వారికి సాయం చేయటంలో ఓ తృప్తి ఉంటుంది. ఎమ్మెల్యేగా గెలవక ముందుకూడా చాలామందికి సాయం చేశా. సాయం చేసి చెప్పుకోవడం నచ్చదు. ఆపద కాలంలో ప్రభుత్వం నుంచి సాయం పొందడానికి సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్వోసీలు ఉన్నాయి.. పేద, మధ్య తరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

– తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి

వనపర్తి: ఆరోగ్య సమస్యలతో సాయం కోసం వచ్చే వారి విషయంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఉదారంగా వ్యవహరిస్తున్నారనేందుకు 34 నెలల్లో పంపిణీ చేసిన సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్వోసీలు, వాటి విలువను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. అనారోగ్యం ఓ మనిషి సమస్యకాదు.. ఆ కుటుంబం ఆర్థిక వ్యవస్థను ప్రశ్నార్థకంలో పడేస్తుందని గుర్తెరిగి ప్రభుత్వంతో సాయం అందించడం ఆయన నైజం. నియోజకవర్గంలో గత 34 నెలల్లో 7,872 మందికి రూ.20 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, 469 మందికి రూ.19.98, కోట్ల విలువైన ఎల్వోసీలు అందించారు. సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్వోసీల మంజూరులో నియోజవర్గం రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలవడం చెప్పుకోదగిన విషయం. ప్రతి దరఖాస్తును ఒక కుటుంబ సమస్యగా భావించి సిఫారస్‌ చేస్తున్నట్లు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ప్రతిసారి ఎమ్మెల్యే చెప్పడం విధితమే. సాయం కోసం ప్రజలు వనపర్తి నుంచి హైదరాబాద్‌ వరకు తిరుగుతూ ఇబ్బందులు పడకుండా వనపర్తి, హైదరాబాద్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించి ఎల్వోసీలు, సీఎంఆర్‌ఎఫ్‌ల మంజూను పర్యవేక్షించేందుకు కృషి చేస్తున్నారు. ప్రతినెల సుమారు 1,200 నుంచి 1,500 వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేస్తున్నారు. కొన్నినెలల కిందట కాంగ్రెస్‌పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు టూర్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురైతే కేరళ నుంచి విమానంలో హైదరాబాద్‌కు సొంత ఖర్చులతో తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారిని క్రమం తప్పకుండా పరామర్శిస్తూ బాగోగులు తెలుసుకున్నారు.

నేడు సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్వోసీల పంపిణీ..

జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 501 మందికి లబ్ధిదారులకు రూ.1.92 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, 290 మందికి రూ.2.90 కోట్ల విలువైన ఎల్వోసీలు పంపిణీ చేయనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్వోసీల పంపిణీలో రాష్ట్రంలోనే వనపర్తి రెండోస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement