వయోవృద్ధులను నిర్లక్ష్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

వయోవృద్ధులను నిర్లక్ష్యం చేయొద్దు

Oct 2 2026 12:34 AM | Updated on Oct 2 2026 12:34 AM

కొత్తకోట రూరల్‌: తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించి గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. వయోవృద్ధులైన వారిని నిర్లక్ష్యం చేయడం చట్టవిరుద్ధమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి దీపా కాసరగడ్డ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం పెద్దమందడి మండలం జగత్‌పల్లిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వైద్యశాఖ సహకారంతో వయోవృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లల నుంచి వారికి బహుమతుల రూపంలో ఇచ్చిన ఆస్తులను తిరిగి పొందే హక్కు చట్టం కల్పించిందన్నారు. నిరాశ్రయులైన వయోవృద్ధులు ఆర్డీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమ ట్రిబ్యునళ్లను ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసానిచ్చారు. అనంతరం డా. శ్రావణి గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సెల్‌ కృష్ణయ్య, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెనన్స్‌ కౌన్సెల్‌ శ్రీదేవి, ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి, మెడికల్‌ ఆఫీసర్‌ మారుతీనందన్‌, ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్‌, మధుసూదన్‌, సర్పంచ్‌ పెంటయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి సాయికుమార్‌, పారా లీగల్‌ వలంటీర్‌ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement