ప్రభుత్వం ఆదేశిస్తే ఎన్నికల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు
● ఓటరు జాబితా, ఉద్యోగుల గుర్తింపు, శిక్షణలు ఇప్పటికే పూర్తి
● ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు
● పెరగనున్న స్థానాలు
మళ్లీ రిజర్వేషన్ల
ప్రక్రియ తప్పదా..?
అప్పటి పరిస్థితుల ఆధారంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ ప్రకారం.. జిల్లాలోని ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోమారు రిజర్వేషన్లు పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
పెరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు..
గత పరిషత్ ఎన్నికల సమయంలో జిల్లాలో 128 ఎంపీటీసీ, 14 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. ఈసారి ఐదు ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానం పెరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి కొన్ని గ్రామాలను వనపర్తి జిల్లాలో విలీనం చేయడంతో మాచుపల్లి, గుండ్యావాల్యానాయక్‌తండా, సింగాయపల్లి, ముతిరెడ్డిపల్లి, గొల్లపల్లి ఎంపీటీసీ స్థానాలు కొత్తగా ఏర్పాటు కావడంతో పాటు ఏదులను మండలం చేసి ఒక జెడ్పీటీసీ స్థానాన్ని పెంచారు. ప్రస్తుతం 133 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పెరిగిన ఐదు ఎంపీటీసీ స్థానాలు, ఒక మండలం వనపర్తి నియోజకవర్గ పరిధిలోనే ఉండటం గమనార్హం.
వనపర్తి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభించి ఒకరోజు అభ్యర్థుల నుంచి స్వీకరించిన తర్వాత రిజర్వేషన్ల విషయంలో తలెత్తిన చిక్కుముడితో వాయిదా పడిన విషయం పాఠకులకు విధితమే. రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం మరోసారి మే నెలలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించడంతో పల్లెల్లో మళ్లీ ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకున్నట్లయింది. సర్పంచ్ ఎన్నికల సమయంలో బుజ్జగింపులతో రాజీపడి పోటీ నుంచి తప్పుకున్న వారు, ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీ పదవిని దక్కించుకోవాలనుకున్నవారు, జెడ్పీటీసీగా గెలుపొంది కేబినేట్ హోదా కలిగిన జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునే ప్రయత్నాలు గ్రామీణ నాయకులు ముమ్మరం చేస్తున్నారు.
2025, జులై 10 నుంచి 2026, ఫిబ్రవరి 5 వరకు ఎన్నికల సంఘం ఆమోదం లభించిన ఓటర్లను సైతం తుది ఓటరు జాబితాలో చేర్చి సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నవీకరణ చేసిన ఓటరు జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు అందినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ
ఎన్నికలు
ఓటరు జాబితా సవరణ..


