పారదర్శకంగా దుకాణాల కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా దుకాణాల కేటాయింపు

Apr 22 2026 7:42 AM | Updated on Apr 22 2026 7:42 AM

వనపర్తి: జిల్లాకేంద్రంలోని సమీకృత మార్కెట్‌లో ఉన్న 32 దుకాణాలు, ఒక సూపర్‌ మార్కెట్‌, ఒక బాంకెట్‌ హాల్‌ను లాటరీ పద్ధతిన అత్యంత పారదర్శకంగా కేటాయించినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ వెల్లడించారు. మంగళవారం ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లోని దుకాణాల కేటాయింపును మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. 32 దుకాణాలు, సూపర్‌ మార్కె ట్‌, బాంకెట్‌హాల్‌కు 318 దరఖాస్తులు రాగా, లాటరీ పద్ధతిన కేటాయించినట్లు చెప్పారు. మార్కెటింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రసాదరావు, డీఎం స్వరణ్‌సింగ్‌, వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, ఇతర అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement