ఎస్పీ ప్రజావాణికి 12 వినతులు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ ప్రజావాణికి 12 వినతులు

Apr 21 2026 3:50 AM | Updated on Apr 21 2026 3:50 AM

వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయములో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 12 వినతులు వచ్చినట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్‌ను కలిసి సమస్యలు విన్నవించి వినతిపత్రాలు అందజేశారు. ప్రతి ఫిర్యాదును స్వయంగా పరిశీలించి సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులకు ఫోన్‌చేసి తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

వేసవి జాగ్రత్తలు

వివరించాలి

వీపనగండ్ల: వేసవిలో విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి లక్ష్మప్ప, ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్భా విద్యాలయను వారు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భోజనం అందించాలన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తోందని.. ఉత్తమంగా రాణించేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.

‘మిషన్‌ భగీరథ’తో

సంపూర్ణ ఆరోగ్యం

ఖిల్లాఘనపురం: మిషన్‌ భగీరథ నీటితో ఆరోగ్యంగా ఉంటారని మిషన్‌ భగీరథ డీఈ హరీశ్‌ అన్నారు. సోమవారం మండలంలోని ఆగారం గ్రామంలో హర్‌ ఘర్‌ జల్‌, జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమం నిర్వహించగా.. ఆయనతో పాటు ఏఈ నరేష్‌, సర్పంచ్‌ బొక్కెన నర్సమ్మ, ఉప సర్పంచ్‌ మున్నూరు రవి, మహిళా సంఘాల సభ్యులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని వాటర్‌ ట్యాంక్‌ నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈ మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ నీటిలో మనిషికి అవసరమైన లవణాలు ఉంటాయని చెప్పారు. గ్రామంలో 40 కేఎల్‌, 30 కేఎల్‌ ట్యాంకులు రెండు ఉన్నాయని.. మొత్తం 198 ఇళ్లకు కొళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న ప్రాంతంలో కొంతమేర పైపులైన్‌ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవితేజ, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్‌, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించండి

ఆత్మకూర్‌: పుర పరిధిలోని నివాస గృహాలు, దుకాణాలు, కొళాయి బిల్లులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్‌ శశిధర్‌ కోరారు. సోమవారం వార్డు అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కో–ఆప్షన్‌కు 12 దరఖాస్తులు..

స్థానిక పురపాలికలో కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకుగాను సోమవారం వరకు 12 దరఖాస్తులు వచ్చాయని పుర కమిషనర్‌ చికినె శశిధర్‌ తెలిపారు. మంగళవారం వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని.. 23న స్కూృటినీ, అభ్యర్థుల ప్రకటన, 24న ఎన్నిక జరగనుందని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement