చిన్నారి చైత్రికను కాపాడండి | - | Sakshi
Sakshi News home page

చిన్నారి చైత్రికను కాపాడండి

Apr 17 2026 12:50 PM | Updated on Apr 17 2026 12:50 PM

సామాజిక మాధ్యమాల్లో

సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి

మదనాపురం: అరుదైన వ్యాధి స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ (ఎస్‌ఎంఏ) టైప్‌–1తో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి చైత్రికను కాపాడాలని మదనాపురం మండలవాసులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో చిన్నారి దీనగాథను తెలియజేస్తున్నారు. ఇందుకు ఇటీవల ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురితమైన ‘సీఎం సారూ.. ప్రాణం పోయరూ’ కథనాన్ని సీఎం అధికారిక ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాకు ట్యాగ్‌ చేస్తున్నారు. మండలంలోని నెలివిడికి చెందిన రమేశ్‌, సాత్విక దంపతుల ఏకై క కుమార్తె చైత్రిక ఎస్‌ఎంఏ టైప్‌–1 వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. నిరుపేద కుటుంబం కావడంతో చిన్నారి చికిత్సకు అవసరమైన ఖర్చు ను భరించలేక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ముఖ్యమంత్రి స్పందించి చిన్నారి చైత్రిక వైద్యానికి అవసరమైన ఆర్థికసాయం అందించాలని మాజీ ఎంపీటీసీ కుర్మయ్య, రమేశ్‌, ఈశ్వర్‌, దశరథ్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement