జిల్లాలో 414 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
● 1.25 లక్షల ఎకరాల్లో సాగు
● సేకరణ లక్ష్యం 3.75 లక్షల మెట్రిక్ టన్నులు
● గ్రేడ్–1కు మద్దతు ధర రూ.2,389
● సన్నరకానికి రూ.500 బోనస్
అవగాహన కల్పిస్తున్నాం..
మండలంలోని నందిమళ్ల, ఈర్లదిన్నె, క్రాస్‌రోడ్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో, అమరచింతలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం సన్నరకం వరి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుందనే విషయాన్ని రైతులకు వివరిస్తున్నాం. వానాకాలం పంటకు సంబంధించిన బోనస్ చెల్లించడంతో ఈసారి కూడా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యం విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
– అరవింద్, ఏఓ, అమరచింత
పక్కా ప్రణాళికతో ముందుకు..
జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ప్రభుత్వపరంగా వరి ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. జిల్లావ్యాప్తంగా 414 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పంట విక్రయించే రైతులు నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే విధంగా గ్రామాల్లో ఇప్పటి నుంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈసారి యాసంగిలో 3.75 లక్షల మె.ట. వరి ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.
– కాశీవిశ్వనాథ్,
జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
అమరచింత: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కేంద్రాలు వెంటనే ప్రారంభించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గత వారం కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అధికారులు జిల్లావ్యాప్తంగా 414 కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. బోరుబావుల కింద సాగుచేసిన పంట కోతలు ప్రారంభం కావడంతో మండలాల వారీగా కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సన్న రకాలకు బోనస్ చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికే మొగ్గు చూపుతున్నారు.
మొదలైన పంట కోతలు..
జిల్లాలో యాసంగిలో వరి సాగు చేసిన రైతుల పంటలు కోత దశకు చేరాయి. బోరుబావులు, చెరువుల కింద సాగు చేసిన పంటల కోతలు మొదలయ్యాయి. దీంతో అధికారులు కోతలు ఎక్కడెక్కడ ప్రారంభించారో తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో సన్న, దొడ్డురకం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆయా గ్రామాల రైతులు అంటున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఇలా..


