ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Apr 15 2026 7:26 AM | Updated on Apr 15 2026 7:26 AM

వనపర్తిటౌన్‌: తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏడు రోజులుగా విద్యుత్‌ ఆర్టిజన్‌, కార్మికులు దీక్ష చేస్తుండగా.. మంగళవారం శిబిరాన్ని మాజీ మంత్రి సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టిజన్‌ కార్మికులను విద్యుత్‌శాఖలో పూర్తిస్థాయిలో విలీనం చేశారని.. ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమైన హామీలు నెరవేర్చకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో దీక్షా శిబిరాలను సందర్శించి సమస్యలు పరిష్కరిస్తానని మోసం చేసి ఓట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తమ విద్యార్థులకు సన్మానం..

ఉత్తమ మార్కులు సాధించిన జాగృతి, విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల విద్యార్థులను మంగళవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఉన్నతస్థాయికి చేరే సమయంలో ఎన్నో అటంకాలు ఎదురవుతాయని.. వాటన్నింటిని అధిగమించి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. కన్న తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువులను ఎన్నటికీ మరువొద్దని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పుర మాజీ చైర్మన్‌ గట్టు యాదవ్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, నాయకులు ప్రేమనాథ్‌రెడ్డి, సూర్యవంశం గిరి, హేమంత్‌, భాగ్యరాజు, ఇమ్రాన్‌, సయ్యద్‌ జమీల్‌, చిట్యాల రాము, అస్లం, అలీమ్‌, శివగౌడ్‌, లక్ష్మణ్‌గౌడ్‌, వంశీ, ముదసార్‌, రాహుల్‌, తోట శ్రీను, మునికుమార్‌, ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement