ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు
వనపర్తిటౌన్: శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరిగే సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రత్యేక సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ డీఎం దేవేందర్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం డిపోలో ఇందుకు సంబంధించిన బుకింగ్ పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. భద్రాచలం వెళ్లలేని భక్తుల ఇంటికి తలంబ్రాలు చేరేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సౌకర్యవంతంగా, నమ్మకంగా సేవలు అందించడమే లక్ష్యమని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తలంబ్రాలు బుకింగ్ చేసుకోవాలనుకునే వారు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పృథ్వీరాజ్ (సెల్‌నంబర్ 91542 98609), వెంకటేష్ వనపర్తి కంట్రోలర్ (73828 29379) సంప్రదించాలని, రూ.151 చెల్లిస్తే బుకింగ్ చేసి రసీదు ఇస్తారని.. స్వామివారి కల్యాణం అనంతరం తలంబ్రాలు అందజేస్తారని చెప్పారు. కార్యక్రమంలో లాజిస్టిక్స్ ఏటీఎం నారాయణ, డిపో అధికారులు తదితరులు పాల్గొన్నారు.


