టెన్త్ బెటాలియన్ అభివృద్ధికి కృషి
ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ సిబ్బందికి అవసరమైన పూర్తి వసతులు అందించి బెటాలియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ స్పెషల్ పోలీస్ అడిషనల్ డీజీపీ సంజయ్‌కుమార్ జైన్ అన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలోని పదో బెటాలియన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు, పటాలం కమాండెంట్ జయరాజుతో కలిసి నూతన కన్వెన్షన్ హాల్, పాఠశాల వేదిక, టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. త్వరలో నిర్మంచబోయే 30 షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో బెటాలియన్ పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇటీవల ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది పలు ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గాను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్‌రెడ్డి, పాణికి ఉత్కృష్ట సేవా పతకాలను ప్రదానం చేశారు. అలాగే ప్రతిభకనబర్చిన పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్‌రెడ్డి, పాణి, ఆర్‌ఐలు నర్సింహరాజు, ఆర్పీ సింగ్, ధర్మారావు, రాజేశం, రాజు పాల్గొన్నారు.
టెన్త్ బెటాలియన్ అభివృద్ధికి కృషి


