కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
● శుక్రవారం 210 మంది విద్యార్థులు గైర్హాజరు
వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు రెండోరోజు శుక్రవారం ఆంగ్ల పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 25 పరీక్ష కేంద్రాల్లో 6,402 మంది విద్యార్థులకుగాను 6,192 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 210 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,069 మందికిగాను 4,908 మంది హాజరుకాగా.. 161 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,333 మందికిగాను 1,284 మంది పరీక్షకు హాజరవగా 49 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. డీఐఈఓ ఎర్ర అంజయ్య జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల, బాలికల జూనియర్ కళాశాల, శ్రీ సూర్య ఒకేషనల్, స్కాలర్స్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థుల స్క్రీనింగ్‌పై ఆరాతీసి ఎలాంటి మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా సరిగా చెస్‌చేసి గదుల్లోకి అనుమతించాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణ, ఇన్విజిలేటర్ రిజిస్టర్ తదితర రికార్డులను పరిశీలించినట్లు చెప్పారు. అదేవిధంగా డీఈసీ బృందం వనపర్తిలోని వాగ్దేవి, జాగృతి, సీవీ రామన్ జూనియర్ కళాశాల, పానగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఖిల్లా ఘనపురం పరీక్ష కేంద్రం, సిట్టింగ్ స్క్వాడ్ బృందం రావూస్ జూనియర్ కళాశాల, పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీరంగాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.


