సకాలంలో పూర్తయ్యేనా..?
జిల్లాలో గతేడాది ఆగష్టులో అమృత్ 2.0 తాగునీటి పనులు ప్రారంభించారు. అమరచింత, ఆత్మకూర్, వనపర్తి పురపాలికల్లో పనులు ప్రారంభించిన అధికారులు.. ట్యాంకుల నిర్మాణానికి స్థల కేటాయింపులో ఆలస్యం కావడంతో కొత్తకోట, పెబ్బేరులో ఆలస్యమైంది. రెండునెలల కిందట ఆయా పురపాలికల్లో సైతం పనులు మొదలయ్యాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సకాలంలో పనులు పూర్తిచేసి ప్రజల తాగునీటి ఇబ్బందులు తొలగిస్తామని వెల్లడిస్తున్నారు. పనులు చేపడుతున్న కంపెనీకి బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం అవుతున్నా.. పనులు మాత్రం చేపడుతున్నట్లు వివరించారు.


