ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు
అమరచింత: రైతులు ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు పొందే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్ అన్నారు. మంగళవారం మండలంలోని నాగల్‌కడ్మూర్‌లో జరిగిన రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతులకు ఆయిల్‌పాం సాగుపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం రైతులు పండించిన ఆయిల్‌పాం విత్తనాలను జిల్లాలోనే విక్రయించేలా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎకరా సాగుతో ఏడాదికి రూ.లక్ష పైచిలుకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. తక్కువ నీటితో పాటు తక్కువ పెట్టుబడి అవుతుందని చెప్పారు. అదేవిధంగా మామిడి రైతులకు రాయితీ ప్లాస్టిక్ కవర్ల గురించి తెలియజేశారు. పత్తిని సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ అరవింద్, మండల ఉద్యా న అధికారి సతీష్, ఏఈఓ నందకిషోర్ పాల్గొన్నారు.


