సమస్యలకు నిలయం..
కొత్తకోట బస్టాండ్ సమస్యలకు నిలయంగా మారింది. ప్రాంగణం పక్కనే ముళ్లపొదలు ఏపుగా పెరగడంతో పట్టణవాసులతో పాటు ప్రయాణికులు మూత్ర విసర్జన చేస్తుండటంతో దుర్వాసన వస్తోంది. బస్టాండ్‌లో కూర్చోవాలంటేనే ఇబ్బందిగా ఉంది. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని బస్టాండ్‌ను బాగు చేయాలి. – చాపల భాస్కర్, పీఏసీఎస్ డైరెక్టర్
క్యాంటీన్ ఏర్పాటు చేయాలి..
బస్టాండ్‌లో క్యాంటీన్ లేకపోవడంతో దూరప్రాంతా ల ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. స్వ చ్ఛమైన తాగునీరు అని బోర్డుపై రాసి ఉన్నా.. అందుబాటులో లేకపోవడం అధికారుల పనితీరు కు నిదర్శనం. బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. – అయ్యన్న, పట్టణవాసి
స్వచ్ఛతకు కృషి చేస్తాం..
స్థానికులతో పాటు ప్రయాణికులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. బస్టాండ్‌ను ఇంటి మాదిరిగా చూసుకోవాలి. వినియోగించిన ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులు చెత్తకుండీల్లోనే వేయాలి. మరుగుదొడ్లు ఉన్నా వాటిని వినియోగించడం లేదు. ఎవరికీ వారు పరిశుభ్రతపై దృష్టి సారించాలి. సాధ్యమైనంత వరకు బస్టాండ్‌ను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తాం. – దేవేందర్‌గౌడ్,
డిపో మేనేజర్, వనపర్తి
●
సమస్యలకు నిలయం..


