కురుపాం: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు మంగళవారం సంయుక్త దాడులు నిర్వహించారు. కురుపాం ఎకై ్సజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు దీనిపై మాట్లాడుతూ స్థానిక ఎన్నికల నేపథ్యంలో సారా తయారీ, రవాణాను నిరోధించే చర్యల్లో భాగంగా అనిజ, కెరడ, వలవ గ్రామాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. సారా తయారీ కోసం నిల్వచేసిన 8,600 లీటర్ల పులిసిన బెల్లం ఊటనుఽ ధ్వంసం చేసినట్లు తెలిపారు. అనధికార మద్యం విక్రయాల విషయమై జియ్యమ్మవలస మండలం బిత్రపాడు గ్రామానికి చెందిన జి.గౌరీశంకర్, గుమ్మలక్ష్మీపురం మండలం బీరుపాడు గ్రామానికి చెందిన శకుంతలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి నుంచి 22 మద్యం సీసాలు స్వాఽ దీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు. చెప్పా రు. ఈ దాడుల్లో విజయనగరం ఎన్ఫోర్స్మెంట్ ఏఈ ఎస్ ఎంవీ.గోపాల కృష్ణ, పార్వతీపురం మన్యం జిల్లా అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్, కురుపాం ఎకై ్సజ్ శాఖ ఎస్ఐ జె.రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.


