ఈ చిత్రంలో కనిపిస్తున్నది బొబ్బిలి మండలం చల్లారపు వలసలో టీడీపీ నాయకుల కళ్లాలకు వెళ్లేందుకు అనువుగా వేసుకున్న సీసీ రోడ్డు. దీనికోసం రూ.3.50లక్షల ప్రజాధనం ఖర్చుచేశారు. టీడీపీ నాయకుడే కాంట్రాక్టర్ కావడంతో ఆ పార్టీ కార్యకర్తల కళ్లాలకు రోడ్డు వేసుకున్నారని, పల్లె పండగ పేరుతో ప్రజాధనాన్ని ప్రభుత్వం టీడీపీ నాయకులకు దోచిపెడుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు.
చిత్రంలో కనిపిస్తున్నది బొబ్బిలి మండలం సీతయ్యపేట గ్రామ శివారున నిర్మించిన సీసీ రోడ్డు. పల్లె పండగ పేరుతో రూ.4.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు వేశారు. నాణ్యతకు పూర్తిగా తిలోదకాలిచ్చేశారని, ఊరు శివారున కావడంతో రోడ్డు పనులను ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. రూ.2 లక్షలు కూడా ఖర్చుకాని రోడ్డు పనులకు ఏకంగా రూ.4.50 లక్షలు వెచ్చించడంపై ముక్కునవేలేసుకుంటున్నారు. రోడ్డు నాణ్యతను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చిత్రంలో కనిపిస్తున్న సీసీ రోడ్డు బొబ్బిలి మండలం సీహెచ్ బొడ్డవలసలోనిది. అసలు జనావాసాలు లేనిచోట రూ.4లక్షల ఖర్చుతో సీసీ రోడ్డు నిర్మించారని, దీనివల్ల కాంట్రాక్టర్కు డబ్బులు మిగిలాయే తప్ప ప్రజలకు ప్రయోజనం లేదని గ్రామస్తులు పలువురు చెబుతున్నారు.


