● జగన్ పర్యటనను విజయవంతం చేయాలి
● ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స, వైఎస్సార్సీపీ నెల్లిమర్ల
నియోజకవర్గ సమన్వయకర్త సన్యాసినాయుడు
నెల్లిమర్ల రూరల్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం భోగాపురం రానున్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు (సురేష్ బాబు), వైఎస్సార్ సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి గదల సన్యాసినాయుడు (సన్నీ) పిలుపునిచ్చారు. నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలో ఎమ్మెల్సీ పెనుమత్స స్వగృహంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. భోగాపురం మండలం ఉప్పాడపేటకు చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకకు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సన్రే రిసార్ట్స్కు అధినేత హాజరవుతారన్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పతివాడ సత్యనారాయణ, ఎస్.రామారావు, రేగాన శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


